ప్రధాని మోదీతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక భేటీ అయ్యారు. ప్రధాని మోదీని ఈ నెల 15న ప్రారంభమయ్యే రైతు భరోసా పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా సీఎం వైయస్‌ జగన్‌ ఆహ్వానించారు.   పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా నిధుల ఆదా వివరాలను ప్రధానికి సీఎం జగన్‌ వివరించినట్లు సమాచారం. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని కోరారు. నాగార్జున సాగర్‌-శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టుకు ఆర్థికసాయం చేయాలని, విశాఖ-కాకినాడ పెట్రో కెమికల్‌ కారిడార్‌ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది. పోలవరం, రెవెన్యూ లోటు భర్తీకి నిధులు ఇవ్వాలని ప్రధానికి సీఎం వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంపీలు ఉన్నారు.

Back to Top