ఉప రాష్ట్రపతితో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

 న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, నందిగం సురేష్, బాల శౌరి పాల్గొన్నారు. కాగా నిన్న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌...ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం 13వ షెడ్యూలులో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే. మంగళవారం పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో సాయంత్రం 4.35 గంటల నుంచి 5.20 వరకు 45 నిమిషాల పాటు ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానికి వినతిపత్రం సమర్పించారు.  
 

Back to Top