సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఇజ్రాయెల్ అధికారులు

 అమరావతి : ఇజ్రాయెల్‌ అధికారులు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం కలిశారు. భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి డాక్టర్‌ రాన్‌ మాల్కా, ఇజ్రాయెల్‌ పొలిటికల్‌ సెక్రటరీ నోవా హకీమ్‌, ఇండో-ఇజ్రాయెల్‌ చాంబర్‌ ఆప్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ మాజీ అధ్యక్షుడు ఉదయ్‌కేన్‌ సాగర్ సీఎంతో భేటీలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. రాన్‌ మాల్కాకు శాలువా కప్పి ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ సత్కరించారు. ఙ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేష్‌ పాల్గొన్నారు.

Back to Top