రాష్ట్రపతితో ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఢిల్లీలో రెండో రోజు ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ పర్యటన కొనసాగుతోంది. ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసిన సీఎం వైయస్‌ జగన్‌ ..అనంతరం రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి తిరుపతి ప్రసాదం అందజేసి, దుశ్శాలువాలతో సత్కరించారు. కాగా, నిన్న ప్రధాన నరేంద్రమోదీని కలిసిన వైయస్‌ జగన్‌ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వినతిపత్రం అందజేశారు. వైయస్‌ జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి, వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top