న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధానితో సీఎం వైయస్ జగన్ చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాల ఆమోదంపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ గ్యాప్ విడుదల అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రత్యేక హోదా అంశ ప్రస్తావన మరోమారు తేవడంతో పాటు కీలక అంశాలను ప్రధాని భేటీలో సీఎం వైయస్ జగన్ ప్రస్తావనకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సీఎం వైయస్ జగన్‌కు ఘన స్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టులో సీఎంకు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మార్గాని భరత్, వంగా గీత, మాధవి, అయోధ్య రామిరెడ్డి, గురుమూర్తి, మాధవ్, రంగయ్య, రెడ్డప్ప, సత్యవతి, కోటగిరి శ్రీధర్, మోపిదేవి వెంకటరమణ ఘన స్వాగతం పలికారు.