కాసేపట్లో హైదరాబాద్‌కు ఏపీ సీఎం వైయ‌స్‌ జగన్‌

తాడేప‌ల్లి:  ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేప‌ట్లో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. మంత్రి గౌతమ్‌రెడ్డి మరణ వార్త తెలుసుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. వైద్యులు గౌతమ్‌రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top