ధర్మాడి సత్యంను సన్మానించిన సీఎం వైయస్‌ జగన్‌

 తూర్పు గోదావరి: కచ్చులురు వద్ద ప్రమాదానికి గురైన బోటును వెలిసి తీసిన ధర్మాడి సత్యంను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సన్మానించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించిన అనంతరం సత్యం, ఆయన బృందానికి సీఎం వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. బోటు వెలికి తీసినందుకు సీఎం అభినందించారు.  బోటు వెలికితీయడం కష్టం అని నిపుణులు నిర్ధారణకు వచ్చినప్పటికీ ధర్మాడి సత్యం తన బృందం సభ్యులతో బోటును వెలికితీశారు. ఆయన సాహసాన్ని మెచ్చుకున్న ప్రభుత్వం ధర్మాడి  సత్యం బృందానికి రూ. 50 వేల రివార్డు, సభ్యులందరికీ ప్రశంసా పత్రాలు ఇది వరకే అందజేశారు.

Read Also: శ్రీశైలం డ్యామ్‌ భద్రతకు ఎలాంటి ముప్పులేదు 

Back to Top