కోనేరు హంపికి సీఎం వైయస్‌ జగన్‌ అభినందనలు

అమరావతి :  ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయం రాష్ట్ర, దేశ ప్రజలకు గర్వకారణం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని సీఎం ఆకాంక్షించారు. కాగా శనివారం ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్ షిప్ లో హంపి మహిళల విభాగంలో విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్‌ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ఆమెకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.

Back to Top