గిరిజన ప్రాంతలను అభివృద్ధి చేయాలి

కేంద్ర హోం శాఖ సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ 
 

ఢిల్లీ: యువత మవోయిస్టుల వైపు ఆకర్శితులు కాకూడదంటే గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలో ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి  ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ, ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు.గిరిజన ప్రాంతం సాలూరులో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. యువత మావోహిస్టుల వైపు ఆకర్శితులు కాకుండా ఉండాలంటే ఇవన్నీ కేంద్రం తక్షణమే మంజూరు చేయాలని కోరారు.

Back to Top