ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి

ప్రధాని మోదీకి సీఎం వైయస్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు
 

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ నేడు 69వ పుట్టిన రోజుల వేడుకలను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. ‘గౌరవనీయ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. జీవితాంత ఇలానే సంతోషంగా, ఆరోగ్యంగా ప్రజా జీవితంలో ఉండాలి’ అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  

Back to Top