నూత‌న వ‌ధువ‌రుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వాదం

ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడి వివాహానికి  తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజ‌రు
 

హైదరాబాద్‌:  మ‌ఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌ రెడ్డి వివాహానికి ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌రై నూత‌న వ‌ధువ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం.. ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌ రెడ్డితో వీఎన్‌ఆర్‌ ఫామ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ హాజరయ్యారు. ఒకరినొకరు పలకరించున్నారు. పక్కపక్కన కూర్చుని కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం వేదిక మీదకు వెళ్లి వధువరూలను ఆశీర్వదించారు. 

 

తాజా ఫోటోలు

Back to Top