కాసేపట్లో ఏపీ కేబినెట్‌ భేటీ ప్రారంభం

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది. కేబినెట్‌ భేటీలో ఎస్‌ఐపీబీ నిర్ణయాలపై చర్చించి ఆమోదించనున్నారు. అదే విధంగా గ్రీన్‌ ఎనర్జీలో రూ.81 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నారు. పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. విశాఖలో పేదల ఇళ్ల నిర్మాణంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చిస్తారు. 

Back to Top