ఏపీ కేబినెట్‌ మీటింగ్‌ ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనుంది. రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇసుక విధానంపై కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది.ఇసుక సరఫరా ధరపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి సభ్యులను 19 నుంచి 25కు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభంకానున్న నాణ్యమైన రేషన్‌ బియ్యం సరఫరాపై చర్చ జరుగే అవకాశం ఉంది.ప్రతి నెలా కొత్త సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయనుంది.  సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.  

Back to Top