సీఎం వైయ‌స్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన‌ స‌చివాల‌య ఉద్యోగులు

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం తాజా భేటీలో తీసుకున్న ఓ నిర్ణయం పట్ల  సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం వైయ‌స్‌ జగన్‌కు స‌చివాల‌య ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయంలో 85 అదనపు పోస్టులను ఏపీ కేబినెట్  సమావేశంలో మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను సీఎం వైయ‌స్ జగన్‌ పరిష్కరించారు. ఈ క్రమంలో.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి.

Back to Top