జులై 8న వైయ‌స్‌ఆర్‌ రైతు దినోత్సవం 

ఏపీ మంత్రివర్గ కీలక నిర్ణయాలు

100 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌ల ప్రారంభానికి ఆమోదం 

 640 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం 

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు 

45 కొత్త రైతు బజార్ల ఏర్పాటు, ఆర్‌బీకేల వద్ద గోడౌన్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం 

 అమరావతి: జులై 8న వైయ‌స్‌ఆర్‌ రైతు దినోత్సవం జరపాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం భేటీ అయిన ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 100 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌ల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. 640 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 

అలాగే.. 45 కొత్త రైతు బజార్ల ఏర్పాటు, ఆర్‌బీకేల వద్ద గోడౌన్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఊటుకూరులో నాటుకోళ్ల హేచరీస్‌ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అదే విధంగా... ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమాచార శాఖ మంత్రి పేర్ని కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

కేబినెట్‌ నిర్ణయాలు

 దివంగత ముఖ్యమంత్రి వైయస్‌.రాజశేఖరరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జులై 8న చేపట్టనున్న రైతు దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు కేబినెట్‌ ఆమోదముద్ర
– ఇందులో భాగంగా రైతు భరోసా కేంద్రాల ప్రారంభం. 1898 ఆర్‌బీకేలు శాశ్వత భవనాలు ప్రారంభం.
– అదేరోజున 100 వైయస్సార్‌ ఇంటిగ్రేటెడ్, ఆక్వా, సీఏడీడీఎల్‌ ల్యాబులు ప్రారంభం. రూ. 79.50 కోట్ల ఖర్చు.
– 645 తొలి విడత కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ప్రారంభం. రూ.96.64 కోట్ల ఖర్చు.
– 53 వెటర్నరీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రూరల్‌ లైవ్‌ స్టాక్‌ యూనిట్స్‌ ప్రారంభం. రూ. 31.74 కోట్ల ఖర్చు.
– పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా టెలీ మెడిసిన్‌ కాల్‌సెంటర్‌ ప్రారంభం. దీనికోసం రూ. 7.53 కోట్ల ఖర్చు.
– పశు – మత్స్య దర్శిని మ్యాగ్‌జైన్‌ ప్రారంభం
– ఆర్బీకేల ద్వారా పశుసంవర్థకం, ఆక్వా రంగాలకు ఇన్‌పుట్స్‌ ప్రారంభం
– ఆర్బీకేల స్థాయిలో 1,262 గోడౌన్ల నిర్మాణంకోసం శంకుస్థాపన.
– పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక పోస్ట్‌ హార్వెస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కింద రూ.200.17 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. ఈ పనులకు శంకుస్థాపన. అనకాపల్లి బెల్లం, రాజమండ్రి అరటి, శ్రీకాకుళం జీడిపప్పు, చిత్తూరు మామిడి, బాపట్ల చిరుధాన్యాలు, వైఎస్‌ఆర్‌ కడప అరటి, హిందూపురం వేరుశనగ, కర్నూలు టమాట ప్రాసెసింగ్‌ యూనిట్‌ 
– రూ.212.31 కోట్ల మార్కెట్‌యార్డుల్లో నాడు – నేడు కింద అభివద్ధి పనులు. 
– రూ. 45 కోట్లతో కొత్తగా రైతు బజార్లకు ఏర్పాటు పనులకు శంకుస్థాపన. 6 కొత్త రైతు బజార్ల ప్రారంభోత్సవం

– 2020–25 ఫుడ్‌ప్రాససింగ్‌ విధానానికి కేబినెట్‌ ఆమోదం
– రైతులకు మెరుగైన రేట్లు వచ్చేలా, రైతు కేంద్రంగా పాలసీకి రూపకల్పన.
– ఫుడ్‌ప్రాససింగ్‌కు అనుగుణమైన వెరైటీల సాగు, ప్యాకేజింగ్‌ పరిశ్రమకు ప్రోత్సాహం, పంట చేతికొచ్చిన తర్వాత నష్టాలను నివారించి, ఫుడ్‌ ప్రాససింగ్‌ ప్రక్రియను మరింత విస్తరించి రైతుల ఆదాయాలను పెంచాలన్నది ఉద్దేశం.
– తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా ప్రస్తుతం ఉన్న ఫుడ్‌ప్రాససింగ్‌ పరిశ్రమల రంగాన్ని మరింతంగా బలోపేతం చేస్తారు. 
– పంటలసాగు, అధిగ దిగుబడులు తదితర అంశాల్లో పరిశోధలు చురుగ్గా సాగడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞాన్ని బదలాయించేలా చూస్తారు.
– ఫుడ్‌ ప్రాససింగ్‌ పరిశ్రమలకు ఉత్పత్తుల కొరత రాకుండా నాణ్యమైన, మెరుగైన వంగడాలను సాగుచేసేలా పంటల ప్రణాళిక అమలు చేసేలా చూస్తారు.
– గుడ్‌ అగ్రికల్చరల్‌ ప్రాక్టీస్‌ ద్వారా నాణ్యతమైన ఉత్పత్తులు వచ్చేలా చేస్తారు. 
– ఈ రంగంలో అతిపెద్ద కంపెనీలతో టై అప్‌ చేసుకోవడంద్వారా విస్తారమైన మార్కెటింగ్‌ అవకాశాలను అందుబాటులోకి తీసుకువస్తారు. 
– సంబంధిత పంటలు పండే ప్రాంతాలకు సమీపంలోనే ఫుడ్‌ప్రాససింగ్‌ క్లస్టర్స్‌ను ఏర్పాటు చేస్తారు. 
– ఫుడ్‌ ప్రాససింగ్‌ రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుస్తారు. 
– ముడి పదార్థాల కొరత లేకుండా ఆర్బీకేలతో అనుసంధానం చేసి ఆమేరకు ఆపంటలు సాగుచేసేలా, మంచి ఉత్పత్తి వచ్చేలా చూస్తారు. 

– కడప జిల్లా ఉటుకూరులో కడక్‌నాథ్‌ జాతి కోళ్ల పౌల్ట్రీ ఫాంకు కేబినెట్‌ఆమోదం
– ఇప్పటికే ఇక్కడున్న పౌల్ట్రీఫాంను దీనికి అనుగుణంగా తీర్చిదిద్దనున్న ప్రభుత్వం. 
– 20వేల కడక్‌నాథ్‌ జాతి పిల్లలను ఉత్పత్తిచేసేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన.
– జులై 8న శంకుస్థాపన
– నాటుకోడి మాంసం, నాటుకోడి గుడ్లకు ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో ఈప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్న  రాష్ట్ర ప్రభుత్వం
– రైతులకు మెరుగైన ఆదాయాలకోసం ప్రభుత్వం ప్రయత్నాలు.

చిత్తూరు జిల్లా పుంగనూరులో కొత్తగా అగ్రికల్చర్‌ పాలి టెక్నిక్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
– ఏడాదికి 40 మంది విద్యార్థులకు ప్రవేశాలు, రెండేళ్లపాటు కోర్సు. 

 కడప జిల్లా బి.కోడూరు మండలం ప్రభలవీడులో వెటర్నరీ డిస్పెన్సరీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.
 – రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌ల ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర.
– 108, 104 తరహాలో సేవలు అందించనున్న అంబులెన్స్‌లు 
– అనారోగ్యంతో ఉన్న పశువులకు చికిత్సకోసం ఈ అంబులెన్స్‌లను ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. 
– మొబైల్‌ వాహనాల్లో హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ లాంటి సదుపాయాలు.
– మొబైల్‌ వాహనంలో నిపుణులైన సిబ్బంది, సరిపడా సదుపాయాలు.
– రూ. 63 కోట్ల రూపాయలతో కొత్త వాహణాలు సహా ఈ ఏడాది నిర్వహణా ఖర్చులు కలుపుకుని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 89.95 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం.
– దీంతోపాటు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు. కాల్‌సెంటర్లలో వెటర్నరీ డాక్టర్లు. నేరుగా రైతుకు కాల్‌ చేసి పశువుల ఆరోగ్యంపై ఆరా, ఆమేరకు చికిత్స. 

 రైతులు, కొనుగోలు దారులు, వ్యాపారులను అనుసంధానించేలా రూపొందించిన ‘‘ఆంధ్రప్రదేశ్‌ ఫార్మర్స్‌ ఇ–విక్రయ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’’ (ఏపీఎఫ్‌ఈవీసీఎల్‌) ఇ– మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫాంకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌.
– స్పెషల్‌పర్పస్‌ వెహికల్‌గా ఏర్పాటు.
– యూనిఫైడ్‌ మార్కెట్‌ ప్లేస్‌గా అన్నినెట్‌వర్క్‌లను అనుసంధానిస్తూ..  ఈ ఫ్లాట్‌ఫాం ఏర్పాటు.
– అంతర్‌రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వ్యాపారులను ఇక్కడి రైతుల ఉత్పత్తులతో అనుసంధానం చేయనున్న ఫ్లాట్‌ఫాం.
– ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌ – వేర్‌ హౌసింగ్, లాజిస్టిక్స్, రియల్‌టైమ్‌ ప్రొడక్షన్‌ అప్‌డేట్స్, మిగులు నుంచి డిమాండ్‌ వరకూ మ్యాపింగ్, మార్కెట్‌లింకేజీ, ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ తదితర అవసరాలను తీర్చనున్న కొత్తఫ్లాట్‌ఫాం.

 – దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు ఆకుటుంబాన్ని ఆదుకునేందుకు వీలుగా వైయస్సార్‌ బీమా పథకానికి మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌.
– కేంద్ర ప్రభుత్వం బీమా పథకంనుంచి వైదొలగిన నేపథ్యంలో, లబ్ధిదారుల నమోదులో బ్యాంకులు ముందడుగువేయలేని పరిస్థితుల్లో కొత్త పథకాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి బాధ్యతలను స్వీకరించనున్న రాష్ట్ర ప్రభుత్వం.
– ఈ బీమా కింద 18 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వారు సహజ మరణానికి రూ. లక్ష, 18 నుంచి 70 సంవత్సరాల మధ్య గల వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా, లేక శాశ్వత అంగవైకల్యం జరిగినా రూ. 5 లక్షల పరిహారం 

– రెడ్డి, కమ్మ, క్షత్రియ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్‌ అనుమతి.

– 25 బీసీ కార్పొరేషన్ల స్థానంలో 56 కార్పొరేషన్ల ఏర్పాటు బైలాస్‌కు కేబినెట్‌ ఆమోదం.
– ఒక ఛైర్మన్, 12 మంది డైరెక్టర్లతో ఏర్పాటైన కార్పొరేషన్లు. 
– వీరు కాక మరో 4గురు అధికార వర్గం నుంచి సభ్యులు.

– పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పథకం కింద చురుగ్గా ఇళ్లనిర్మాణం పనులు
– మొత్తంగా 28.30 లక్షల ఇళ్లను నిర్మిస్తున్న ప్రభుత్వం.
– 17,005 వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల నిర్మాణం
– జులై 1,3,4 తేదీల్లో గ్రౌండింగ్‌కోసం స్పెషల్‌ క్యాంపెయిన్‌.
– జులై 10 కల్లా 7 లక్షలు, ఆగస్టు 31లోగా 3 లక్షల ఇళల్లో నిర్మాణ పనులు ప్రారంభంకావాలని లక్ష్యం.
– మిగిలినవి ఆగస్టు 10 – సెప్టెంబరు 30 మధ్య మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం.
– ఒక్కో ఇల్లు 340 చదరపు అడుగుల్లో లివింగ్‌ రూమ్, బెడ్‌రూమ్, కిచెన్, టాయిలెట్, వరండా ఉంటాయి. 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్‌లైట్లు, 4 బల్బులు.
– రెండు విడతల్లో ఈ కార్యక్రమం, మొదటి విడతలో 15.60 లక్షల ఇళ్ళ నిర్మాణం, జూన్‌ 2022 కల్లా పూర్తి చేయాలని నిర్ణయం, రెండో విడతలో మిగిలిన 12.70 లక్షల ఇళ్లు.
– ఈ ఇళ్ళ నిర్మాణం ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు
– 03.06.2021న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం, ఇప్పటికే 3.36 లక్షల ఇళ్ళు గ్రౌండింగ్‌

– అమ్మఒడి, వసతి దీవెనల కింద డబ్బుకు బదులగా ల్యాప్‌ టాప్‌ కావాలంటే సమ్మతి తెలిపిన వారికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చే కార్యక్రమానికి కేబినెట్‌ ఆమోదం.
– 9 నుంచి 12 వ తరగతి చదువుతున్న విద్యార్ధుల్లో అమ్మ ఒడికి బదులుగా లాప్‌ టాప్‌ కోరుకుంటున్నవారు 8,21,655 మంది. 
– జగనన్న వసతి దీవెవన లబ్ధిదారుల్లో 1,10,779 మంది ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల ఎంపిక.
– మార్కెట్లో కన్నా తక్కువ ఖర్చుతో ల్యాప్‌టాప్‌లు అందించనున్న ప్రభుత్వం.
– డ్యుయల్‌ ప్రాససర్, 4 జీబీ ర్యాం, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్, విండోస్‌ 10 (ఎస్‌టీఎఫ్‌ మైక్రోసాఫ్ట్‌), ఓపెన్‌ ఆఫీస్‌ ( ఎక్సెల్, వర్డ్, పవర్‌ పాయంట్‌) మరియు మూడేళ్ల వారంటీతో ల్యాప్‌టాప్‌లు. 
– లెనోవా, డెల్, ఏసర్, హెచ్‌పీ కంప్యూటర్లు.

– ప్రకాశం జిల్లాలో యూనివర్శిటీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
– ప్రకాశంజిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట వద్ద ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం.
– ప్రస్తుతం ఉన్న పీజీ సెంటర్‌ను రీలొకేట్‌ చేయనున్న ప్రభుత్వం. 
– 19 డిపార్ట్‌మెంట్లతో యూనివర్శిటీ
– 50 మంది టీచింగ్‌ స్టాఫ్, 50 మంది నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌
– వేయిమంది విద్యార్థులతో తొలుత ప్రారంభం.
 
 
– కొత్తగా మంజూరుచేసిన పలాస డిగ్రీకాలేజిలో 27 టీచింగ్‌ పోస్టులు,
 14 నాన్‌ టీచింగ్‌పోస్టులను మంజూరుచేస్తూ కేబినెట్‌నిర్ణయం.

– కడప జిల్లా రాయచోటి డిగ్రీకాలేజీలో 29 టీచింగ్‌ పోస్టులు, 14 నాన్‌ టీచింగ్‌పోస్టులను మంజూకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. 

– విజయనగరంలో ఉన్న జేన్‌టీయూకే కాలేజీనీ జేన్‌టీయూ– విజయనగరం యూనివర్శిటీగా మార్చనున్న ప్రభుత్వం. దీనికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.
– దీనికోసం 24 అదనపు టీచింగ్‌ పోస్టులు, 17 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయం.
– ఉత్తరాంధ్ర జిల్లాల విద్యార్థులకు లబ్ది.
– దీనిద్వారా విజయనగరం జిల్లాలో యూనివర్శిటీ ఏర్పాటు.
 

– పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు లాభాపేక్ష లేకుండా, సరసమైన ధరలకు ఇచ్చే ఇళ్లస్థలాల పథకానికి కేబినెట్‌ ఆమోదం
– జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్స్‌కు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.
– మార్గదర్శకాలను ఆమోదం తెలిపిన కేబినెట్‌.
– స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌కు విపరీత స్పందన. 
–  3.79 లక్షల దరఖాస్తులు.
– 150 చదరపు గజాలు , 200 చదరపు గజాలు, 240 చదరపు గజాల విస్తీర్ణంలో మూడురకాలుగా ప్లాట్లు.
– ఒక కుటుంబానికి ఒకటే ప్లాటు.
–  ఏడాది గరిష్ట ఆదాయం రూ.18 లక్షలు.
– రాష్ట్రానికి చెందిన వ్యకై్త ఉండాలి. 18 ఏళ్ల పైబడి ఉండాలి.
– లాటర్‌ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక.
– స్మార్ట్స్‌ టౌన్స్‌లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు. 
– 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, తాగునీరు సరఫరా, యూజీడీ సదుపాయం, పార్కులు, ఓపెన్‌ స్పేస్‌ తదితర సదుపాయాలతో స్మార్ట్‌టౌన్లు.    

– ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధుల సమీకరణ. 
– రూ. 5,990.3 కోట్ల నిధుల సమీకరణకు, ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీకి కేబినెట్‌ ఆమోదం.
– 2,62,216 ఇళ్లను పూర్తిచేయనున్న ప్రభుత్వం.
– మొత్తంగా రూ. 12,101 కోట్లను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం

– 2021– 2024 ఐటీ పాలసీకి కేబినెట్‌ ఆమోద ముద్ర 
– పాలసీలో భాగంగా మౌలిక సదుపాయాలను గణనీయంగా అభివద్ధిచేయనున్న ప్రభుత్వం.
– 3 కాన్సెప్ట్‌ సిటీలను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.
– గ్రామ పంచాయతీ స్థాయిల్లో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు.
– హైస్పీడ్‌ ఇంటర్నెట్‌సదుపాయాన్ని గ్రామాలకు కల్పిస్తున్న ప్రభుత్వం.
– ఎక్కడనుంచైనా పనిచేసే వాతావరణాన్ని తీసుకురావడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్న ప్రభుత్వం. 
– నైపుణ్యాలను మెరుగుపరచడంపై పాలసీలో పెద్దపీట.
– దీనికోసం విశాఖపట్నంలో హై ఎండ్‌ స్కిల్స్‌లో భాగంగా ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.
 – ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలకూ కేబినెట్‌ ఆమోదం.

 
– కర్నూలు జిల్లా నంద్యాల బేతంచర్లలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐటీఐలో 27 పోస్టులను మంజూరుచేస్తూ కేబినెట్‌ నిర్ణయం.
– నంద్యాల ఐటీఐలో మరో 29 పోస్టులను మంజూరుచేస్తూ నిర్ణయం.
– మొత్తంగా 56 పోస్టులను మంజూరుచేస్తూ కేబినెట్‌ ఆమోదం.

– కాకినాడ డీప్‌సీ వాటర్‌ పోర్టులో ఈపీసీఎల్‌ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌కు కేబినెట్‌ఆమోదం.
– రూ. 1600 కోట్లతో టెర్మినల్‌ డెవలప్‌మెంట్, రూ.200 కోట్లతో ఎల్‌ఎన్‌జీ స్టేషన్ల  ఏర్పాటు.
– మొత్తంగా మొదటి ఫేజ్‌లో రూ.3600 కోట్లు ఖర్చు
– సుమారు 700 మందికి ఉపాధి.
 

– గ్రామ కంఠాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారికి  పట్టాలు ఇచ్చేలా పంచాయతీరాజ్‌ చట్టంలో సరవణలపై ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం.
– జిల్లా పరిషత్‌ సమావేశాలకు ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ కులాల కార్పొరేషన్ల ఛైర్మన్లు శాశ్వత ఆహ్వానితులుగా హాజరయ్యేందుకు కేబినెట్‌ ఆమోదం.
–జిల్లా పరిషత్‌లకు 2వ వైస్‌ఛైర్మన్‌ పదవులను ఏర్పాటుచేస్తూ కేబినెట్‌ నిర్ణయం
– ఈమేరకు చట్టంలో సవరణలకు కేబినెట్‌ ఆమోదం.

– సమగ్ర భూ సర్వేకోసం చట్టంలో కొన్ని సవరణలకు కేబినెట్‌ ఆమోదం.
– వ్యవసాయేతర భూమికి యాజమాన్య హక్కుపత్రాలు ఇచ్చేలా సవరణలు.
– ఆస్తిపరమైన వివాదాలకు, కేసులకు చెక్‌ పెట్టేలా హక్కుపత్రాల జారీ.

 
– ప్రకాశంజిల్లా మార్కాపూర్‌మండలం రాయవరం వద్ద కిడ్నీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌తోపాటు మెడికల్‌కాలేజీ నిర్మాణానికి అవసరమైన 50.33 ఎకరాల భూమిని ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం.

– వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునే దరఖాస్తుల పరిష్కారానికి చట్టంలో సవరణలకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌.
– ప్రస్తుతం ఉన్న సంక్లిష్ట ప్రక్రియను సులభరతరంగా మారుస్తున్న ప్రభుత్వం.
– గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనే దరఖాస్తులకు పరిష్కారం.
– బిల్డింగ్, లే అవుట్‌ అనుమతులతో ఇంటిగ్రేషన్‌.
– ఏకీకత కన్వెర్షన్‌ రేటు. కంప్యూటర్లతో రేట్ల గణన.
– ఆన్‌లైన్లో పద్ధతుల్లో మొత్తం ప్రక్రియ.
– ఏపీఐఐసీ ద్వారా భూమి పొందే పరిశ్రమలకు ఈ పద్ధతినుంచి మినహాయింపు. ఎప్పటికప్పుడు ప్రకటించే విధానాల ప్రకారం వర్తింపు.
– ఆక్వాకల్చర్, డెయిరీ, పౌల్ట్రీరంగాలకు కొత్త పద్ధతినుంచి మినహాయింపు.
– వ్యవసాయేతర భూములపై నిరంతర వివరాల సేకరణ, రికార్డులు తయారీ.

 
– ప్రకాశంజిల్లా ఒంగోలు మండలం మామిడిపాలెం వద్ద సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రికోసం 6.17 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం.
– గవర్నమెంట్‌ జనరల్‌ ఆస్పత్రిని అభివద్దిచేయనున్న ప్రభుత్వం.
– దీన్ని ప్రభుత్వ మెడికల్‌కాలేజీకి అటాచ్‌ చేయనున్న ప్రభుత్వం.

– 2180 ఎకరాల కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూములు తిరిగి రైతులకు.
– వీరికి మేలు జరిగేలా స్టాంప్‌డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ ఫీజు, రిజిస్ట్రేషన్‌ ఫీజులనుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం.
– దీనికి కేబినెట్‌ ఆమోదం.

– రాయలసీమ కరవు నివారణ పథకం కింద పుట్టపర్తి నియోజకవర్గంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి గ్రావిటీ, లిఫ్ట్‌ ద్వారా అన్నిచెరువుల్లో నీరు నింపే కార్యక్రమానికి రూ.864.18 కోట్ల ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం.
– ఈ ప్రాజెక్టు కింద 195 చెరువులను నింపనున్న ప్రభుత్వం.
 

– తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
– 19 పోస్టులను మంజూరుచేసిన ప్రభుత్వం.

– విజయవాడ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్, తిరుపతి కళ్యాణి డ్యాం పీటీసీ, గ్రే హౌండ్స్, విజయనగరం పీటీసీ ప్రిన్సిపల్, విజయవాడ సిటీ సెక్యూరిటీ వింగ్, మంగళగిరి పీటీఓ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేస్తూ కేబినెట్‌ నిర్ణయం.

– విజయవాడ నగరంలోని గుణదలలో కొత్తగా లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు.
– మాచవరం, సత్యాన్నారాయణపురం స్టేషన్లకు సంబంధించి ప్రాంతాల్లోని కొన్నింటితో కొత్త పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు.
– ఒక సీఐ, 15 కానిస్టేబుల్‌ పోస్టులను మంజూరుచేస్తూ కేబినెట్‌నిర్ణయం.

– రాష్ట్రంలో కొత్తగా 539 కొత్త 104 వాహనాల కొనుగోలు, నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం.
– ఈ ఏడాదికి రూ.165.09 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం.
– ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు. 

– అనంతపురం ప్రభుత్వ నర్సింగ్‌కాలేజీ 28 పోస్టుల భర్తీకి కేబినెట్‌ అంగీకారం. 

– కోవిడ్‌ నివారణా చర్యలు, వాక్సినేషన్‌కు కేబినెట్‌ ఆమోదం.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top