నూత‌న మంత్రుల‌కు శాఖ‌లు కేటాయింపు

తాడేపల్లి: నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన చెల్లుబోయిన శ్రీ‌నివాస వేణుగోపాలకృష్ణ‌, సీదిరి అప్పలరాజుకు శాఖలు కేటాయించారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ధర్మాన కృష్ణదాస్‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వితో పాటు రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్‌ నారాయణకు కేటాయించారు. నూత‌న మంత్రులు సీదిరి అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖ బాధ్యతలు, వేణుగోపాల‌కృష్ణ‌కు బీసీ సంక్షేమ శాఖను కేటాయించారు.

 

Back to Top