వివిధ బిల్లులపై అసెంబ్లీలో చర్చ

అమ‌రావ‌తి:  అసెంబ్లీలో వివిధ బిల్లుల‌పై చ‌ర్చ జ‌రుగుతుంది. బీసీల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. వెనుక బడిన తరగతుల అభివృద్దికి అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నమన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్దికి కొత్తగా మూడు చట్టాలు తీసుకొచ్చామని అన్నారు.

 జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. సుమారు 37 లక్షల మందికిపైగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామన్నారు. జగనన్న విద్యాదీవెన పథకంతో స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయన్నారు. పిల్లల భవిష్యత్‌ను గత ప్రభుత్వం పక్కనపెట్టిందని గోవర్థన్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా కొన్ని  జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించామన్నారు. అన్ని రకాల సహాయక చర్యలు ప్రభుత్వం చేపట్టిందన్నారు.

Back to Top