మహిళ భద్రతకు సీఎం వైయ‌స్‌ జగన్ పెద్దపీట

అసెంబ్లీలో దిశ చట్టంపై చర్చలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత 

ప్రారంభమైన మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు 

అమ‌రావ‌తి: మహిళ భద్రతకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అసెంబ్లీలో దిశ చట్టంపై చర్చలో ఆమె మాట్లాడుతూ.. మహిళలపై జరిగే నేరాలను నియంత్రించ గలిగామని తెలిపారు. 89 లక్షల మందికిపైగా దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రతి పీఎస్‌లో ఉమెన్‌ హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశాం. దిశ చట్టంపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని సుచరిత పేర్కొన్నారు. 
మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. హార్టికల్చర్‌ నర్సరీల రిజిస్ట్రేషన్‌ సవరణ బిల్లును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. బీసీ కుల జనాభా గణన తీర్మానాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఎస్సీ,బీసీ,మైనార్టీల సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

తాజా ఫోటోలు

Back to Top