అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

ఇటీవ‌ల మ‌ర‌ణించిన మాజీ సభ్యులకు నివాళి

అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ శాస‌న స‌భ్యులు ఎంఏ. అజీజ్‌, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి మృతి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఈరోజు 14 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మహిళా సాధికారత మీద స్వల్పకాల చర్చ జరగనుంది. ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌  తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఏపీ అసెంబ్లీలో రేపు(శుక్రవారం) బీసీ జన గణన చేపట్టాలని కేం‍ద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌ ప్రవేశపెట్టనున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top