ఫిబ్రవరి 8 వరకు అసెంబ్లీ సమావేశాలు..

 బీఏసీలో నిర్ణయం   

అమ‌రావ‌తి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 8వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని బీఏసీ స‌మావేశంలో తీర్మానించారు. అసెంబ్లీ స‌మావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యాయి గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశమైంది. ఈ బీఏసీ సమావేశంలో నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 8 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.  బుధవారం (ఫిబ్రవరి 7న) అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీఏసీ సమావేశం అనంతరం స్పీకర్‌‌‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సమావేశమయ్యారు.   
 

Back to Top