ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు

 మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్‌రెడ్డి
 

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాలు దేశంలో ఎక్క‌డా లేవ‌ని మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో మంత్రి మాట్లాడారు. పార్టీలు, కులాలు, మతాలకతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటివద్దే ప్రభుత్వం అందిస్తోందన్నారు.  ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేదలకు అండగా ప్రభుత్వం ఉందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. 

ప్రశ్నలకు సమాధానాలు వినే ఓపిక కూడా టీడీపీ సభ్యులకు లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ధ్వజమెత్తారు. ప్రతిపక్షం లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో అన్నీ వెన్నుపోటు పథకాలేనని మంత్రి బుగ్గన దుయ్యబట్టారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top