గౌత‌మ్‌రెడ్డి మరణ వార్త వినగానే షాక్‌కు గురయ్యాం

మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌
 

 
అమ‌రావ‌తి:  మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి హ‌ఠ్మార‌ణంపై షాక్‌కు గుర‌య్యామ‌ని మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ పేర్కొన్నారు.  వివాదాలు లేని వ్యక్తి మేకపాటి గౌతమ్‌రెడ్డి. ఎలాంటి ఇగో లేని వ్యక్తి. గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు.  ఆ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. 2010 నుంచి సన్నిహితగా మెలిగామంటూ వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మంత్రి అనిల్‌. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు ప్రసంగించాడు మంత్రి అనిల్‌.  

 బంగారం లాంటి మనిషిని రాష్ట్రం కోల్పోయింది. మేకపాటి కుటుంబంతో 30 ఏళ్ల అనుబంధం ఉంది: మంత్రి బాలినేని

దురదృష్టకరం: ఆర్కే రోజా

 గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి రావడం దురదృష్టకరం అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ప్రజల మెప్పు మాత్రమే కాదు.. తోటి రాజకీయ నేతల మెప్పుకూడా పొందిన వ్యక్తి. అజాతశత్రువు ఆయన. ప్రతిపక్షాల మెప్పు సైతం పొందిన వ్యక్తి. వైయ‌స్ జగనన్నకి నిజమైన సైనికుడు గౌతమ్‌రెడ్డి.

పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డిలు గౌతమ్‌ రెడ్డి సంతాప తీర్మానంపై సభలో ప్రసంగించారు. 

► గౌతమ్‌.. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే వ్యక్తి : పెద్దిరెడ్డి

► ఎన్ని బాధ్యతలు నిర్వహించినా.. వివాదాలు లేకుండా సమర్థవంతుడిగా పేరుంది గౌతమ్‌ రెడ్డికి. ఆయన లేని లోటు తీరనిది: కాకాణి

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top