ఉరవకొండ నియోజకవర్గానికి మరో 2500 ఇళ్ళు మంజూరు 

గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి ర‌మేష్‌

అనంత‌పురం: ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గానికి మ‌రో 2500 ప‌క్కా ఇళ్ల‌ను మంజూరు చేస్తున్న‌ట్లు మంత్రి జోగి ర‌మేష్ తెలిపారు. అనంత‌పురం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న‌ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ను నగరంలోని ఆర్&బి లో ఉరవకొండ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గ సమస్యలు ఆయనకు విన్నవించారు. ప్రస్తుతం మంజూరైన 26 వేల ఇళ్లతో పాటు మరో 2500 నూతన ఇళ్ళు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే మంత్రిని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి వెంటనే 2500 ప‌క్కా ఇళ్ల‌ను మంజూరు చేస్తున్న‌ట్లు తెలిపారు. దీంతో మంత్రికి విశ్వేశ్వ‌ర‌రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top