వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు  

  అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన 11 మంది వైయ‌స్ఆర్‌సీపీ  అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం మండలిలో 18 మంది వైయ‌స్ఆర్‌సీపీ  సభ్యులు ఉన్నారని, వారిలో 11 మంది బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందినవారేనని చెప్పారు. ఇప్పుడిస్తున్న 14 స్థానాలతో కలిపి మొత్తం 32 స్థానాల్లో 18 మంది సభ్యులు బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఉన్నారన్నారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల విలేకరుల సమావేశం నిర్వహించారు. శాసనమండలి పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తున్న ఘనత పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్ జగన్‌కే దక్కిందని ఈ సందర్భంగా సజ్జల పేర్కొన్నారు. సీనియర్‌ నాయకులతో చర్చించి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం ఖరారు చేశారని అన్నారు. ఎమ్మెల్యే కోటా కింద వచ్చే మూడు స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక న్యాయం పాటించామని, పాలవలస విక్రాంత్, ఇసాక్‌ బాషా, డీసీ గోవిందరెడ్డిల పేర్లను ప్రకటించామని గుర్తు చేశారు.

14 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఇందులో 7 స్థానాలు బీసీ, ఎస్సీ, మైనార్టీలకు కేటాయించగా.. మిగిలిన 7 స్థానాలను ఓసీలకు కేటాయించారన్నారు. 50 శాతం బీసీ, ఎస్సీ, మైనార్టీలకు సీట్లు కేటాయించారన్నారు. కౌన్సిల్‌ చరిత్రలో తొలిసారి నలుగురు మైనార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారని తెలిపారు.

  • ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు- కాపు)
  • తలశిల రఘురాం (కృష్ణా జిల్లా- కమ్మ సామాజిక వర్గం)
  • మురుగుడు హనుమంతరావు (గుంటూరు- చేనేత)
  • వై.శివరామిరెడ్డి (అనంతపురం- రెడ్డి సామాజిక వర్గం)
  • అనంత ఉదయభాస్కర్ (తూర్పు గోదావరి- కాపు)
  • ఇందుకూరు రఘురాజ్ (విజయనగరం- క్షత్రియ)
  • వరుదు కల్యాణి (విశాఖ- బీసీ- వెలమ)
  • వంశీకృష్ణ యాదవ్ (విశాఖ- యాదవ)
  • మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా- ఎస్సీ సామాజిక వర్గం)
  • కేఆర్ జే భరత్ (చిత్తూరు- బీసీ. వన్యకుల క్షత్రియ)
  • తూమాటి మాధవరావు (ప్రకాశం- కమ్మ సామాజిక వర్గం)
  •  

 

Back to Top