అన్న‌మ‌య్య‌, చిత్తూరు జిల్లాల నేత‌లకు సీఎం దిశానిర్దేశం

అన్న‌మ‌య్య జిల్లా: మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో భాగంగా అమ్మ‌గారిప‌ల్లి నైట్ స్టే పాయింట్ వ‌ద్ద బుధ‌వారం ఉద‌యం అన్న‌మ‌య్య‌, చిత్తూరు జిల్లాల‌కు చెందిన ప‌లువురు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేరుపేరునా ప‌ల‌క‌రిస్తూ వారి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ చేసేందుకు విశేషంగా ప‌నిచేయాల‌ని, ఐదేళ్లుగా వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌భుత్వం చేసిన మంచిని, ప్ర‌జ‌ల‌కు అందించిన సంక్షేమాన్ని, వివిధ రంగాల్లో తీసుకువ‌చ్చిన గొప్ప సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌తి గ‌డ‌ప‌కూ వివ‌రించాల‌ని పార్టీ నేతలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ దిశానిర్దేశం చేశారు. 

Back to Top