సాగునీటి ప్రాజెక్ట్‌లపై చర్చకు సిద్ధం

లోకేష్‌కు మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ స‌వాలు 

నెల్లూరు:సాగునీటి ప్రాజెక్ట్‌లపై చర్చకు తాను సిద్ధ‌మ‌ని, లోకేశ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాల‌ని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ స‌వాలు విసిరారు. చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదు. సోమశిల హైలెవల్‌ కెనాల్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక పనులు స్టార్ట్‌ చేశామ‌ని గుర్తు చేశారు. శ‌నివారం  మీడియా స‌మావేశంలో  టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌కు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

పులకేశి చేసేది పాదయాత్ర కాదు. లోకేశ్‌.. రాష్ట్రంలో పాదయాత్ర తర్వాత చేయొచ్చు కానీ.. నువ్వు గతంలో పోటీ చేసిన మందలగిరిలో మందు గెలువు అంటూ కామెంట్స్‌ చేశారు.  నారా లోకేశ్‌కు సరిగ్గా మాట్లాడటం కూడా రావడం లేదు. టీడీపీ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. లోకేశ్‌.. రాష్ట్రంలో పాదయాత్ర తర్వాత చేయొచ్చు కానీ.. నువ్వు గతంలో పోటీ చేసిన మందలగిరిలో మందు గెలువు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

 ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేరే చరిత్ర ఆనం రామనారాయణది అని అనిల్‌కుమార్ విమ‌ర్శించారు. అవినీతి చేసిన ఆనంను పక్కన పెట్టుకుని లోకేశ్‌ అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పద‌ని హెచ్చ‌రించారు.  పార్టీలో ఉన్న కలుపు మొక్కలను మేమే పీకి పక్కడ పడేశామ‌ని పేర్కొన్నారు. 

ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. లోకేశ్‌ పాదయాత్ర వల్ల టీడీపీకే నష్టమ‌న్నారు. ఎవరెన్ని పాదయాత్రలు చేసినా మళ్లీ వచ్చేది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వమే. లోకేశ్‌ పాదయాత్ర అట్టర్‌ ప్లాప్‌. జనాలు లేక లోకేశ్‌ పాదయాత్ర వెలవెలబోతోంది అంటూ ఆదాల కామెంట్స్‌ చేశారు.  

Back to Top