అందుకే పచ్చపార్టీ వాళ్లను  ప్రజలు తరిమి కొట్టారు..

ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

హైదరాబాద్‌: తానేం చేసినా అడ్డుకోరాదని చంద్రబాబు ఉద్యమమే చేశారని  ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.సీబీఐని బ్యాన్‌ చేసి ఈడీ,ఐటీ దాడులను అడ్డుకున్నారని ట్విట్‌ చేశారు.సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ జగన్‌ ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.దొంగలను రక్షించేది లేదని వైయస్‌ జగన్‌ తేల్చి చెప్పారని పేర్కొన్నారు. అధికారం అంటే దోచుకోవడం.,దాచుకోవడమేనని పచ్చపార్టీ వాళ్లు అనుకున్నారని, అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారని విమర్శించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top