విజయవాడ: అంగన్వాడీ యూనియన్ నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ,ప్రభుత్వ సలహాదారు సజ్జల మరోసారి చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించాయని అంగన్వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి బొత్స మీడియా సమావేశంలో తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ► అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశాం ► జూలైలో జీతాలు పెంచుతాం ► ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని 50 వేల నుంచి లక్షా 20 వేల రూపాయలకు పెంచాం ► హెల్పర్ కు 60 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం ► మట్టి ఖర్చులు 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ► సమ్మె కాలానికి జీతాలు ఇస్తాం ► సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేస్తాం ► వేతనాల పెంపు పై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తాం ► గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటిస్తాం ► ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళ కు పెంచాం ► అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం ► మా ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి ► కక్షసాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వం లేదు ► మినీ సెంటర్లను అప్ గ్రేడ్ చేస్తాం విధుల్లోకి అంగన్వాడీలు కాగా ఈ చర్చలకు హాజరైన అంగన్వాడీ యూనియన్ నాయకులు తాము సమ్మె విరమించి విధులకు రేపట్నుంచి హాజరౌతున్నట్టు తెలిపారు. మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి ► చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి ► సమ్మె విరమిస్తున్నాం...రేపట్నుంచి మేం విధులకు హాజరవుతాం ► జీతాలు పెంపు పై నిర్ధిష్ట నిర్ణయంగా జులైలో చేస్తామన్నారు ► మాకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామన్నారు ► రిటైర్మెంట్ బెనిఫిట్ ను పెంచుతాం అని హామీ ఇచ్చారు ► మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ► అగన్వాడీలకు వైఎస్ఆర్ భీమా ఇస్తాం అన్నారు ► రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతాం అని ప్రభుత్వం చెప్పింది ► టిఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచీ వచ్చే లోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుంది ► సీఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పధకాలు అంగన్వాడీలకు వర్తింపుచేస్తాం అన్నారు ► సమ్మె కాలానికి జీతం ఇవ్వడంతో పాటు... కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది