పేదలకు మద్యాన్ని దూరం చేయడమే లక్ష్యం

మద్య నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు

మరో 50 శాతం మద్యం ధరలు పెంపు  

  మొత్తం 75 శాతం పెరిగిన మద్యం ధరలు

విజయవాడ : మద్య నిషేధంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగేసింది. ధర పెంచి, పేదలకు మద్యం దూరం చేయాలనే ఆలోచనతో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.  ధరలు పెంచడం ద్వారా విక్రయాలు తగ్గించి, వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు కానుకగా మద్య నిషేధం అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24 గంటల వ్యవధిలో మద్యం ధరలను మరోసారి పెంచింది. నిన్న షాపులను తిరిగి ప్రారంభించిన తరువాత, 25 శాతం మేరకు ధరలను పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా మద్యం ధరలను మరో 50 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  దీంతో మద్యం ధరలు మొత్తం 75 శాతం పెరిగినట్టయింది. పెంచిన ధరలు నేటి(మంగళవారం) నుంచే అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పెంచిన ధరలతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అలాగే ఈ నెలాఖరులోగా మరో 15 శాతం మద్యం షాపులు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా కేంద్రం మార్గదర్శకాల మేరకు దాదాపు 45 రోజుల తర్వాత నిన్న మద్యం దుకాణాలకు అనుమతించడంతో.. నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మద్యాపానాన్ని నిరుత్సాహరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.  ప్రభుత్వ నిర్ణయం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

Back to Top