తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసి.. ఆంధ్రరాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.