రాష్ట్రాభివృద్ధికి ఆర్థికి సాయం చేయండి

 ప్రధాని మోదీతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ 
 

న్యూఢిల్లీ : రాష్ట్రాభివృద్ధికి ఆర్థికి సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుమారు 45 నిముషాల పాటు కొనసాగింది.  ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని మోదీని కోరినట్టు సమాచారం. ఇక మోదీతో భేటీకి ముందు సౌత్‌ బ్లాక్‌లో పీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాతో ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బృందం 40 నిముషాలపాటు సమావేశమైంది. సీఎంతో పాటు  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, బాలశౌరి, రఘురామకృష్ణంరాజు, ఇతర ఎంపీలు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

Back to Top