25న ఈబీసీ నేస్తం ప్రారంభం

  అగ్రవర్ణాల పేద మహిళలకు 45 వేలు ఆర్థిక సహాయం

ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు  

ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం  

జగనన్న టౌన్ షిప్పులలో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబేటుతో ఇవ్వాలని నిర్ణయం  

ఉద్యోగులతో చర్చలకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు  

 కిదాంబి శ్రీకాంత్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి తిరుపతిలో ఐదెకరాల భూమి కేటాయింపు
 
వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ మెడికల్‌ కాలేజీ ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం

రాష్ట్ర సివిల్‌ సప్లై కార్పొరేషన్‌కు రూ. 5 వేల కోట్ల ఆర్థిక వెసులుబాటు

క్యాబినెట్  నిర్ణ‌యాలు వెల్ల‌డించిన మంత్రి పేర్ని నాని 

అమరావతి: ఈ నెల 25వ తేదీ ఈబీసీ నేస్తం ప‌థ‌కాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభిస్తార‌ని మంత్రి పేర్నినాని తెలిపారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉద్యోగులు రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగులకు జగనన్న టౌన్‌షిప్ లలో ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రతిపాదనకు  ఆమోదం తెలిపిన కేబినెట్‌.. టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబెట్ తో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణ‌యాల‌ను మంత్రి పేర్నినాని మీడియాకు వివ‌రించారు.

క్యాబినెట్‌ నిర్ణయాలు 

  • రాష్ట్రంలో 3వ విడత కోవిడ్‌ విస్తరణ జరుగుతున్న తీరు, ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల పట్ల మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చించింది. కోవిడ్‌ నివారణ, వైద్యా ఆరోగ్యశాఖ చర్యలు, కోవిడ్‌ సెంటర్ల ఏర్పాటు, ఉద్యోగాల నియామకాలపై ప్రతి అంశంపై అధ్యాయనం చేశాం.
  •  సీఎం వైయస్‌ జగన్‌ సంబంధిత శాఖాధిపతులను ఒక్క మరణం కూడా సంభవించకుండా బాధ్యతగా వ్యవహరించాలని, ఎంత మంది అవసరమైతే అంత మందిని కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియామకాలు చేపట్టి కోవిడ్‌ మరణాలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
  • మరణాల సంఖ్య చూస్తే దేశంలోని సరాసరిలో రాష్ట్రం చాలా తక్కువ స్థాయిలో ఉంది. కోవిడ్‌ నివారణలో ఏపీ మెరుగైన చర్యలు తీసుకుంటుంది. వ్యాక్సిన్‌ వేయడంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ప్రభుత్వ పనితీరును ఈ చర్యలు తెలియజేస్తాయి.
  • ఆర్థికంగా వెనుకబాటుతనం కలిగిన అగ్రవర్ణాలకు ఈబీసీ నేస్తం కింద ఇవ్వాల్సిన రూ.589 కోట్లకు ఆమోదం తెలిపాం. వెనుకబడిన కులాలు, షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ జాతులు, కాపులు, మైనారిటీలు కాకుండా అగ్రవర్ణాల్లోని అన్ని వర్గాలకు ఈబీసీ నేస్తం ద్వారా ఆర్థికసాయంగా 45 నుంచి 60 ఏళ్ల వారికి అమలు చేస్తున్నట్లు ప్రకటించగానే 4,59,328 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3,92,674 మందిని అగ్రవర్ణ ఆర్థిక వెనుకబాటు కలిగిన మహిళలుగా గుర్తించాం. వారికి ఏటా రూ.15 వేల చొప్పున రాబోయే మూడేళ్లలో రూ.45 వేలు ఆర్థికసాయం అందజేస్తున్నాం. ఈ నెల 25వ తేదీన ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభిస్తారు.
  • రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌ కాలేజీలకు అవసరమైన రూ.7880 కోట్లు, ఇప్పటికే అందుబాటులో ఉన్న మెడికల్‌ కాలేజీల్లో కూడా రూ.3820 కోట్లతో అభివృద్ధి చేసేందుకు పరిపాలన అనుమతులను మంత్రి మండలి ఆమోదించింది.
  • ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి మండలి ఆమోదించింది.
  • 11వ పీఆర్‌సీకి కూడా ఆమోదం తెలిపాం.
  • కోవిడ్‌ విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం. అర్హత ఆధారంగా  జూన్‌ 30వ లోగా నియామకాలు చేపడుతున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న స్థానాల్లో కారుణ్య నియామకాలు చేపడుతాం.
  • జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సొంత ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే లాటరీ పద్ధతిలో కాకుండా 10 శాతం ఉద్యోగులకు, పెన్షనర్లకు 5 శాతం రిజర్వ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 20 శాతం రిబెట్‌తో ఈ స్థలాలను అందించాలని మంత్రి మండలిలో తీర్మానం చేశాం.
  • ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు 8 అడిషనల్‌ డైరెక్ట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులు మంజూరు చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
  • ఆయుష్‌ విభాగంలోని నేచ్యూరోపతి, యోగా డిస్పెన్సరీలో 78 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. 20 డిస్పెన్సరీలలో ముగ్గురు చొప్పున పని చేస్తారు. 
  • ఇటీవలే మున్సిపాలిటీగా మారిన వైయస్‌ఆర్‌ తాటిగడప పంచాయతీలో ఉన్న  59 సచివాలయ పోస్టులను మున్సిపాలిటికీ బదిలీ చేశాం,
  • కర్నూలు జిల్లా డోన్‌లో ఏర్పాటు చేస్తున్న బాలికల గురుకుల బీసీ పాఠశాల, జూనియర్‌ కాలేజీలకు, బేతంచెర్లలోని బాలుర గురుకుల పాఠశాలలకు 58 ఉద్యోగాలను మంజూరు చేశాం.
  • కృష్ణపట్నం పవర్‌ ప్లాంట్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను సమర్ధులకు అప్పగించేందుకు అవసరమైన బిడ్డింగ్‌కు ఆమోదం తెలిపాం. 25 ఏళ్ల పాటు ఆపరేషన్‌ మోయింటెన్స్‌ కోసం  ఇవ్వాలని, ఇతర కంపెనీలకు అప్పగించే సమయంలో అందులో పని చేసే జేన్‌కో సిబ్బందిని తిరిగి ఆ సంస్థలోనే కొనసాగే ఐచ్ఛిక అవకాశాన్ని వారికే కల్పిస్తున్నాం. 
  • వరుస నష్టాలను చవిచూస్తున్న కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్‌ కిలోవార్జ్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం రూ. 3.14 పైసలు ఖర్చు అవుతుంది. ఆ పరిసరాల్లోని మరో ప్లాంట్‌లో రూ.2.34 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. నిర్వాహణ ఖర్చులు తగ్గించుకునేందుకు నిర్ణయం తీసుకున్నాం.
  • వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పింఛన్ల పెంపునకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2,250 నుంచి రూ.2,500 పెంచుతూ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
  • ఏపీఐఐసీ నోడల్‌ ఏజెన్సీగా ఆటోనగర్‌లో ఉన్న భూములను బంగ్లా అవసరాలకు వ ఇనియోగించుకునేందుకు గ్రూప్‌ పాలసీకి ఆమోదం
  • విశాఖ జిల్లా ఎండాలో రాజీవ్‌ గృహ కల్పా ప్రాజెక్ట్‌లో నిరూపయోగంగా ఉన్న భూములను హెచ్‌ఐజీ, ఎంఐజీ కాలనీల కోసం వాడుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
  • తిరుపతిలో స్టార్‌ బాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబీ శ్రీకాంత్‌ అకాడమీ ఏర్పాటు చేసుకునేందుకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తూ మంత్రి మండలి ఆమోదంతెలిపింది.
  • ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీ పరిధిలోని అనకాపల్లిలో రిజినల్‌ అగ్రికల్చర్‌ రిసోర్స్‌కు ఉచితంగా భూమి ఇస్తూ నిర్ణయం తీసుకున్నాం. 50 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం.
  • ఎండోమెంట్‌చట్టం 1987కి సవరణలతో ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం. టీటీడీకి ప్రత్యేక ఆహ్వానితుల నియామాకానికి సంబంధించి సవరణలు తీసుకురావాలని క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.
  • ఓటీఎస్‌ పథకంలో  ఇళ్ల రిజిస్ట్రేషన్లు, టిడ్కోలోని అపార్టుమెంట్ల రిజిస్ట్రేషన్, విశాఖలో మిషనరీ ఆఫ్‌ చారిటీలకు రిజిస్ట్రేషన్‌ చార్జీలకు మినహాయింపునకు ఆమోదం
  • ఐసీడీఎస్‌కు బాలామృతం, రాజా పాలు ఆమూల్‌ సరఫరా చేసేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం. ఏపీ డెయిరీ ఫెడరేషన్‌ ద్వారా పాలు సేకరిస్తాం. 
  • మీట్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌లో 7 ఉద్యోగాలకు ఆమోదం 
  • శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీకి 13 పోస్టులు మంజూరు 
  • జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో స్వల్ప మార్పులు చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో వాయిదా పద్ధతిలో ఓటీఎస్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించేలా వెసులుబాటు కల్పించాం. రెండు వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించాం.
  • రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర సివిల్‌ సప్లై కార్పొరేషన్‌కు రూ. 5 వేల కోట్లు ఆర్థిక వెసులుబాటు కల్పించుకునేందుకు కెబినేట్‌ ఆమోదం తెలిపింది. సీఎం వైయస్‌ జగన్‌ చొరవ వల్ల ఈ ఏర్పాటు చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రమే ధాన్యాన్ని కొనుగోలు చేసి 21 రోజుల్లోనే డబ్బులు అందజేస్తోంది. ఏ రైతుకు కూడా 22వ రోజు డబ్బులు అందలేదని ఫిర్యాదులు రాకూడదన్నదే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం. ఇప్పటి వరకు 21.38 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాం.
  • వ్యవసాయం గురించి కూడా సీఎం వైయస్‌ జగన్‌ కేబినెట్‌లో సమీక్ష నిర్వహించారు. ఉద్యాన వనం శాఖ బెస్ట్‌ అవార్డును దక్కించుకుంది. 
  • 2021లో 19 రకాల నూతన వంగడాలు వృద్ధి చేసినట్లు మంత్రి మండలి దృష్టికి వచ్చింది. 
  • గతంలో కంటే వ్యవసాయ రంగంలో 11.3 శాతం, ఉద్యాన వన శాఖలో 12.3, పశు సంవర్థక శాఖలో 11. 7 శాతం, మాంసం ఉత్పత్తిలో 10.3 శాతం అభివృద్ధిని ఏపీ రాష్ట్రం సాధించింది.
  • క్రాప్‌ ఇన్సూరెన్స్‌లో ఏపీ దేశంలోనే రోల్‌మాడల్‌గా నిలిచింది.
  • కడప, కర్నూలు విమనాశ్రాయాలు గతంలో ట్రూప్‌ అప్‌ సంస్థ నడిపేది. ఈసారి ఇండిగో సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఇక నుంచి కడప, కర్నూలు నుంచి విజయవాడకు విమానాలు నడపాలని కేబినెట్లో ఆమోదం తెలిపిన‌ట్లు మంత్రి పేర్నినాని వెల్లడించారు.  
Back to Top