జ‌న‌వ‌రి 26 నుంచి ‘అమ్మ ఒడి’ అమలు

 ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌కు ఏపీ కేబినెట్ ఆమోదం

నామినేటెడ్  పద‌వులు ర‌ద్దు చేయాలి

అధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాలు

అమ‌రావ‌తిః జ‌న‌వ‌రి 26 నుంచి అమ్మ ఒడి పథకం అమలుకు కేబినెట్‌ నిర్ణయించింది. ప్రతిశాఖలో అవినీతి జరగకుండా మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సూచించారు. పారదర్శక పాలన అందించేందుకు మంత్రులు సర్వశక్తులు ఒడ్డాలన్నారు. నామినేటెడ్  పదవులను రద్దు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్‌ తొలి  సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను మంత్రులకు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సుదీర్ఘంగా వివరించారు.వివిధ పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.అనేక కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరిగింది.  రైతులు, మహిళలు, అవ్వాతాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మిక ప్రయోజనాలే ఎజెండాగా సీఎం కేబినెట్‌ సమావేశం నిర్వహించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై చర్చ జరిగింది.అజెండాలోని అన్ని అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ 27 శాతం పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.ఆశావర్కర్ల జీతాలు రూ.3వేల నుంచి 10వేలకు పెంపునకు ఆమోదం తెలిపింది.ఏపీలో పింఛన్ల పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనంపై చర్చించేందుకు కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు.

సీపీఎస్‌ రద్దుకు సంబంధించి ఒక కమిటీని వేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.సీపీఎస్‌ను రద్దు చేయడానికి సూత్రప్రాయంగా కేబినెట్‌ ఆమోదించింది.సాంకేతిక,న్యాయపరమైన సమస్యలపై  చర్చ జరిగింది. 

తాజా వీడియోలు

Back to Top