'ఆటా' మ‌హాస‌భ‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆహ్వానం

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేష‌న్ (ఆటా) ప్ర‌తినిధులు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ మేర‌కు అమెరికాలోని వాషింగ్ట‌న్ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న 17వ అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్ మ‌హా స‌భ‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆటా ప్ర‌తినిధులు ఆహ్వానించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో ఆటా ప్రెసిడెంట్‌ భువనేష్‌ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాద రెడ్డి లింగాల, ఆటా ఫైనాన్స్‌ కమిటీ చైర్మన్‌ సన్నీ రెడ్డి, ఆటా అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ జయంత్‌ చల్లా ఉన్నారు. 

తాజా వీడియోలు

Back to Top