తంబళ్లపల్లె: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర వేలాది మందితో కిక్కిరిసిపోయింది. మొలకల చెరువు మూడురోడ్ల సెంటర్‌లో భారీ బహిరంగసభకు ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. ఆద్యంతం అశేష జనవాహిని.. నేతల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, ఉషాశ్రీచరణ్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు అనీల్‌కుమార్ యాదవ్, హఫీజ్‌ఖాన్, ద్వారకానాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే.. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... – దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక విప్లవానికి నాంది పలికారు. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల స్థితిగతులు పెరగడానికి, వారి కుటుంబాలు బాగుండడానికి అవకాశాలు కల్పిస్తున్న జగనన్న. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో పేదల కుటుంబాల వారికి అందుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కకడా లేవు. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేసిన వ్యక్తి, దగాకోరు చంద్రబాబు. – చంద్రబాబు దళితుల మీద దాడులు చేయించాడు. – బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు. బీసీలు జడ్జిలుగా పనికి రారు అన్నాడు. – కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న పాలన జగనన్న చేస్తున్నారు. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్ర వర్ణాల్లోని పేదలకు, ఈ నాలుగున్నరేళ్లలో, నేరుగా రూ 2.35 లక్షల కోట్లు అందజేసిన సంక్షేమ సారథి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి. – ఇందులో రూ.1.76 లక్షల కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా అందాయి. మంత్రి ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ.... – బాబు హయాంలో అన్నీ స్కాంలే. అందుకే ఆయన అధికారంలోఉండగా చేసిన కుంభకోణాలతో స్కాంల సీఎం గా పేరుగాంచారు. – ప్రతి క్షణం ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించే జగనన్న స్కీంల సీఎం అయ్యారు. జనం గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఈ ప్రభుత్వం ఎంతగా ఆదరిస్తోందో అందరికీ తెలుసు. – రామాయణ మహాకావ్యాన్ని రాసిన వాల్మీకి మహర్షి పుట్టిన రోజును పండగరోజు చేసిన ఘనత జగనన్నదే. – జగనన్న హయాంలో వెనకబడిన కులాల్లో పుట్టినందుకు మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గర్వపడుతున్నారు. – బడ్జెట్‌లో సింహభాగం మహిళలకే కేటాయించి, వారి సాధికారత తనకున్న చిత్తశుద్దిని చాటుకున్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. – మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అంటున్న దమ్మున్న నాయకుడు జగనన్న. మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ... – జగనన్న మన బిడ్డలకు మేనమామగా చదివిస్తున్నాడు. –అవ్వాతాతలకు మనవడిగా నెల మొదటి రోజునే ఫించన్లు అందేలా చేశారు. అదీ ఇంటి గడప దగ్గరకే వచ్చి ఇచ్చేలా చేశాడు. – జగనన్న ఎస్సీలకు అంబేద్కర్‌లాంటి వాడు, బోయలకు వాల్మీకి మహర్షి లాంటి వాడు. – వైయస్ జగనన్న పార్టీ పెట్టకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇన్నేసి పదవులు వచ్చేవా? – జగనన్న అమ్మఒడి ఇస్తుంటే... పిల్లికి బిచ్చం వేయని చంద్రబాబు అమ్మకు వందనం ఇస్తానంటున్నాడు. – మళ్లీ మెల్లగా తన తప్పుడు హామీలను వదులుతున్నాడు. నీమాటలకు మేము మోసపోము బాబు అని ప్రజలు గట్టిగా చెప్పాలి. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... – ఈ రాష్ట్రంలో 65 ఏళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. – 2019 లో జగనన్న అధికారంలోకి వచ్చిన తరువాత ఉప ముఖ్యమంత్రి పదవుల నుంచి సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు వచ్చాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతానికి పైగా ఉన్నత పదవులు ఇచ్చిన జగనన్న. – చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడానికి పార్టీ పెట్టానని చెప్పే వ్యక్తి మనకి అవసరమా? బాబు, పవన్‌కళ్యాణ్‌లు ఎన్నో నాటకాలతో వస్తారు తస్మాత్ జాగత్త! – రాయలసీమలో పుట్టిన లోకేష్ అనే పప్పును చూస్తే జాలేస్తోంది. – అయ్యని జైల్లో వేస్తే ఢిల్లీకి పారిపోయాడు. – ఒక ఊరిలో ఇద్దరు బాగుపడాలంటే బాబు కావాలి. కానీ ఆ ఊరిలో అందరూ బాగుపడాలంటే జగనన్న కావాలి. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ... – చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలను పట్టించుకున్న దాఖలాలు లేవు. విద్య , వైద్యం, పౌష్టికాహారం అందేది కాదు. – ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ప్రేమించే నాయకుడు వైయస్ జగనన్న. – నేడు ప్రభుత్వ స్కూళ్లను నాడు– నేడు కింద కార్పోరేట్ స్కూల్స్ కంటే మెరుగ్గా తీర్చిదిద్దారు. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో పేదల పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివే అవకాశం కల్పించారు జగనన్న. – వాలంటీర్ వ్యవస్థ పెట్టి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్న జగనన్న లాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. – మన పిల్లలను మనం చదివించుకోవాలి. కానీ చదివించే బాధ్యత ఈ రోజున మేనమామగా జగనన్న తీసుకున్నాడు. ఇది పేదలకు అందిన వరం కాదా?! – ఆనాడు వైయస్ రాజశేఖర్‌రెడ్డి మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు జగనన్న నాలుగు అడుగులు ముందుకేసి మైనార్టీలకు మంత్రి పదవులు, ఉపముఖ్యమంత్రి, పలు సంస్థలకు చైర్మన్లుగా పదవులు ఇచ్చారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ.... – నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని ధైర్యంగా చెప్పగలిగే నాయకుడు దేశ చరిత్రలో ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. – దేశ చరిత్రలోనే సామాజిక సాధికారత యాత్రకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్ననే. – వెనుకబడిన తరగతులకు రూ.70,794 కోట్లు, ఎస్సీలకు రూ.60,430, ఎస్టీలకు రూ.20,130 కోట్లు, మైనార్టీలకు రూ.13,470 కోట్లు సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చిన ఘనత జగనన్నదే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ స్దాయిలో సంక్షేమంకోసం ఏ ముఖ్యమంత్రి ఖర్చుపెట్టలేదు. – 56 వెనుకబడిన కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. – చంద్రబాబు ప్రభుత్వంలో ట్రైబల్ కమిషన్ లేదు, గిరిజనులకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వలేదు.