ఓటమి భయంతో కోడెల శివప్రసాద్‌  గందరగోళం సృష్టించారు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

గుంటూరు : ఓటమి భయంతోనే టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్‌ ఇనిమెట్లలో గందరగోళం సృష్టించారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గెలవడం కోసం కోడెల ఎంతకైనా బరితెగిస్తారని విమర్శించారు. అధికారుల్ని,ఓటర్లను బెదిరించడం, పోలింగ్‌ బూతును క్యాప్చర్‌ చేయడం ఆయనకు అలవాటైన పని అన్నారు. ఇనిమెట్లలో కోడెల రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ప్రజలను భయపడడం వల్లే గొడవ జరిగిందన్నారు. ఇనిమెట్ల గ్రామస్తులను భయపెట్టాలని చూస్తే ఉరుకోమని హెచ్చరించారు. సీఎం ఆఫీసు నుంచి ఒత్తిడి రావడంతో గ్రామస్తులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తాము ఇనిమెట్ల గ్రామానికి వెళ్లకపోయినా తమపై కేసులు పెట్టారని, అయినా భయపడేది లేదని తేల్చి చెప్పారు.రిగ్గింగ్‌కు పాల్పలడ్డారని కోడెలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, దాని మీద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

 

Back to Top