కన్నా నోరు అదుపులో పెట్టుకో..

మంత్రి అంబ‌టి రాంబాబు
 

 పల్నాడు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కన్నా లక్ష్మీనారాయణ  అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఇష్టంమొచ్చినట్లు కన్నా మాట్లాడితే వైయ‌స్ఆర్‌సీపీ సహించదన్నారు.  ‘కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి టీడీపీ ఇన్‌చార్ఝ్‌ మాత్రమే. కన్నా పోటీ చేస్తాడో.. పారిపోతాడో తెలియదు. ఎన్నికల ఖర్చుకోసం బీజేపీ ఫండ్‌ పంపితే మింగిన ఘనత కన్నాది.

కన్నా సంగతి అమిత్‌ షాను అడిగితే బాగా చెబుతారు. మాజీ మంత్రి కన్నా పార్టీలు మారిన వ్యక్తి. చంద్రబాబును తిట్టి వారి బొమ్మలకే పాలాభిషేకం చేస్తున్నాడు కన్నా.  కన్నా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. కన్నా సంగతి గుంటూరు కంటే వారి తోటలో ప్రజలు చెబుతారు.. ఆయన ఇంటిముందు ఫ్లెక్సీలు చెబుతాయి’ అని అంబటి మండిపడ్డారు.

Back to Top