గెటౌట్ చంద్రబాబు.. షటప్ చంద్రబాబు : ఇదే ఏపీ ప్రజల నినాదం 

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబ‌టి రాంబాబు

తాడేప‌ల్లి: గెటౌట్ చంద్రబాబు.. షటప్ చంద్రబాబు ఇదే ఏపీ ప్రజల నినాదమ‌ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు.     చంద్రబాబు నినాదం... క్విట్‌ జగన్, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని... కానీ ప్రజల విధానం ఏమిటో 2019 ఎన్నికల్లో, ఆ తరవాత ప్రతి ఎన్నికల్లోనూ చూపించార‌న్నారు. ‘గెటౌట్‌ చంద్రబాబు... షటప్‌ చంద్రబాబు... బైబై బాబు’’ అని ఎన్ని సార్లు చెప్పినా చంద్రబాబు నాయుడు సిగ్గు పడటం లేద‌న్నారు. శుక్రవారం అంబ‌టి రాంబాబు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారుజ‌

- ధరల పెరుగుదల అన్నది సప్లై డిమాండ్‌ మీద ఆధారపడి ఉంటుంది. కానీ హెరిటేజ్‌ స్టోర్‌లో ధర మాత్రం చంద్రబాబు జేబులోకి వచ్చే లాభం మీద ఆధారపడి మార్కెట్‌ కంటే ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. బాబు హయాంలో కందిపప్పు డబుల్‌ సెంచరీ కొడితే... ఆయిల్‌ ధరలు కూడా ఇప్పటి స్థాయికి ఏడేళ్ళ క్రితమే చేరాయి. 

- డీజిల్‌ కానివ్వండి... పెట్రోల్‌ కానివ్వండి... ఏ ధర తీసుకున్నా... మన పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఒక రూపాయి ఎక్కువగా ఉన్నంత మాత్రాన... దాన్ని చాలా దుర్మార్గంగా చూపిస్తున్న చంద్రబాబు బృందం... తమ హయాంలో కూడా ఇదే పద్ధతిలో ఉందని ఎందుకు చెప్పటం లేదు? 

- ఎంతసేపటికీ డీజిల్, పెట్రోల్‌ ధరల్లో ఉన్న ఆ ఒక్క రూపాయి... అర్ధ రూపాయి తేడా గురించి మాట్లాడే చంద్రబాబు... 2014–19 మధ్య బడ్జెట్లలో ఎంత ఆదాయం వచ్చిందో, 2019 నుంచి నేటి వరకు దాదాపు అంతే ఆదాయం వచ్చిందని... అప్పుడు లేని కొవిడ్‌ను కూడా జగన్‌గారి ప్రభుత్వం ఇప్పుడు అదే ఆదాయంతో ఎదుర్కొం దని చెప్పటానికి చంద్రబాబుకు ధైర్యం ఉందా? 

*ప్రజా ఉద్యమం రావటం వల్లే ప్రతిపక్షంలో బాబు*
    ఏపీలో ప్రజా ఉద్యమం అవసరం అని చంద్రబాబు మాట్లాడటం మరీ విడ్డూరం. ఆ ప్రజా ఉద్యమం రావటం వల్లే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు గోల అంతా దత్త పుత్రుడు– తాను ఇంతకు ముందు విడిపోయినట్టు ఆడిన డ్రామా ముగించటానికి మరో డ్రామా ఎలా ఆడాలా అన్నదే.

- డాక్టర్‌ వైయస్సార్‌గారి సమ కాలీకుడైన చంద్రబాబు... వైయస్సార్‌గారినీ ఒంటరిగా ఎదుర్కోలేకపోయాడు. వైయస్సార్‌గారి కొడుకుని, జన నేతను... తన విధానాల ద్వారా తన నాయకత్వం ద్వారా అధికారం తెచ్చుకున్న జగన్‌గారిని ఒక్కడిగా ప్రజల్లో ఎదుర్కోవటం తన వల్ల కాదని చేతులెత్తేయటానికి... ఉమ్మడిగా ఎదుర్కోవటం, పొత్తులు అనే అందమైన పేర్లు పెట్టుకుంటున్నాడు. 

*బాబు కంటే పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవరుంటారు?*
    చంద్రబాబు కంటే పెద్ద యాంటీ సోషల్‌ ఎలిమెంట్‌ ఎవరన్నా ఉంటారా? మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత గొప్పవారు... అని టీడీపీ క్యాడర్లను నేరుగా రెచ్చగొట్టటం వల్లే కదా... ఈ రోజు ఈ పసుపు ఆంబోతులు, మదం ఎక్కిన మృగాల్లా... వీరంతా బాబుకున్న వ్యవస్థల మేనేజ్‌మెంట్‌ను నమ్ముకుని నేరాలకు బరితెగిస్తున్నది? దీనికి ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ఆ నేరాలు చేసినవారితో, ప్రోత్సహించినందుకు ప్రతి ఒక్క కేసులోనూ చంద్రబాబు నాయుడును కూడా నిందితుడిగా చేర్చాలి. 

*లోకేష్ బుడ్డి అంటే బాగుంటుంది*
     అమ్మ ఒడి నాన్న బుడ్డికి సరిపోయింది అని చంద్రబాబు చెపుతున్నాడు. ఇంత దిగజారుడు ఎందుకు? మీ హయాంలో అమ్మ ఒడిలాంటి ఒక్క పథకం అయినా పెట్టటం చేతకాలేదని లెంపలు వేసుకోవాల్సింది పోయి... అమ్మ ఒడిని తక్కువ చేయటానికి నాన్న బుడ్డి అనటం ద్వారా నాన్నలంతా తాగుబోతులని చంద్రబాబు చేస్తున్న ప్రచారం పిల్లల మీద ఎంత దుష్ప్రభావాన్ని చూపుతుందో ఆలోచనైనా లేదు.

-  నాన్న బుడ్డి అనే బదులు...  ‘లోకేశ్‌ నాన్న బుడ్డి’ అని చంద్రబాబు చెపితే బాగుంటుంది. కింగ్‌ పిషర్‌ ను తాను పాలు తాగే నాటినుంచి చూశానని ఆయన అంటున్నాడు కదా? కాబట్టి బుడ్డి బాబు అని పిలిస్తే ఇంకా బాగుంటుంది. గవర్నమెంటు, ప్రైవేటు బడుల్లో ఈ స్కీమ్‌ వల్ల ఏకంగా 7 లక్షల మంది విద్యార్థులు కొత్తగా చదువుకుంటున్నారని కళ్ళకు కనిపిస్తుంటే... దాన్ని కూడా నాన్న బుడ్డి అని మాట్లాడుతున్నాడంటే.... ఇంతకంటే నీచం ఉంటుందా?

- చంద్రబాబు చివరి రెండు సంవత్సరాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇవ్వాల్సిన డబ్బు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అది కూడా అర కొర ఫీజు రీయింబర్స్‌మెంటు... అది కూడా బకాయిలు! కాబట్టి... 2017 నుంచి... అంటే గత అయిదేళ్ళుగా ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లించినది ఎవరంటే జగన్‌గారి ప్రభుత్వం మాత్రమే. 

*విశాఖలో ప్రభుత్వ ఆఫీసులు కట్టడం నేరమా..?*    
    రుషికొండ మీద నిర్మాణం చేస్తే విశాఖ పాడైపోతుందా? అదీ గవర్నమెంట్‌ ఆఫీసులు కడితే ఆక్రమణ అవుతుందా? కబ్జా అవుతుందా? కాదే... కానీ ఆ పక్కనే చంద్రబాబు చుట్టాల గీతం యూనివర్శిటీ మొదలు... బాబు ఇచ్చిన గవర్నమెంట్‌ స్థలాల లీజులు, విద్యా సంస్థలు, చారిటీలు, మరో పేరిట... 1982లో టీడీపీ పుట్టిన నాటి నుంచి ఇదే విశాఖలో చేసిన  ఆక్రమణలు... వీటి మీద చర్చ జరగాలి. తన మనుషులు తింటే చట్టం, న్యాయం... గవర్నమెంట్‌ ఆఫీసులు కట్టటం నేరం అన్నట్టు బాబు మాట్లాడటం పరమ దుర్మార్గం.

- మనిషి రక్తం రుచి మరిగిన పులికి, వేటాడటానికి మనుషులు దొరక్కపోతే ఏ రకంగా పిచ్చెక్కుతుందో... అధికారం పోయిన చంద్రబాబుకు అదే రకంగా పిచ్చి హిమాలయాలకు చేరింది. 

- విశాఖ అభివృద్ధి కావాలా? రాజధాని కావాలా అని అడిగిన చంద్రబాబును... అమరావతి అభివృద్ధి కావాలా? లేక రాజధాని కావాలా అని మేం అడుగుతున్నాం... దీనికి ఆయన  ఏం సమాధానం చెపుతాడు? 

- దేశంలోకెల్లా అత్యధిక డీబీటీ ద్వారా ఈ రోజుకు దాదాపు రూ.1.39 లక్షల కోట్లు... అది కూడా కేవలం 35 నెలల్లో పేదల చేతిలో పెట్టిన ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ గుంట నక్కకు తెలియక... చివరికి దేశంలో కెల్లా అత్యధిక ధరలు, పన్నులు.. అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు పాలనలో స్కీములు లేవు... డీబీటీలు లేవు. జన్మభూమి కమిటీల దోపిడి కింద స్థాయిలో... జల యజ్ఞం దోపిడీ, రాజధాని పేరిట దోపిడీ, ఇసుక పేరిట దోపిడి, మద్యం పేరిట దోపిడి పై స్థాయిలో ఉన్నాయి. 

*అడ్డంగా దోచేయడానికి కుదరటం లేదన్నదే వారి బాధ*
    జగన్‌గారి ప్రభుత్వం అమలు చేస్తున్న నవ రత్నాల్లో బాబు తన 5 ఏళ్ళ పాలనలో ఏ ఒక్కటి అయినా అమలు చేశాడా? నవరత్నాల్లో జగనన్న అమ్మ ఒడి, వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ చేయూత, 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్, 31 లక్షల ఇళ్ళ నిర్మాణం, జగనన్న గోరుముద్ద, నాడు–నేడు... ఇలాంటి స్కీముల ఏ ఒక్కటి అయినా మీ హయాంలో ఉన్నాయా? మరి ఏ స్కీములూ లేకపోయినా ఇంతే ఆదాయం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ డబ్బంతా ఏం చేసింది? తినేసింది అనే కదా? ఇప్పుడు బాబుకు, ఎల్లో మందకు అలా రాష్ట్రం.. అనే చేలో అడ్డంగా ఆంబోతుల్లా తినే అవకాశం దొరకటం లేదన్న బాధ ఈ రోజు విశాఖపట్టణంలో మరీ ఎక్కువగా కనిపించింది. 

- ఈ రోజు కాకపోతే రేపు... ప్రజల అభీష్టం మేరకు, డీ సెంట్రలైజేషన్‌ ఖాయం... విశాఖకు రాజధాని వెళ్ళటం ఖాయం అని అర్థం అవుతుంటే... అమరావతిలో తన బినామీల భూములకు రేట్లు పెరగవన్న ఏడుపు... ఇదీ చంద్రబాబు విశాఖలో ఏడ్చిన ఏడుపు! దాని కోసం విశాఖను, ఉత్తరాంధ్రను త్యాగం చేయమని అడుగుతున్నాడు. 
ఇంతకంటే నీచం ఉంటుందా? 

*బాబు కంటే ఐరన్ లెగ్ రాష్ట్రంలో ఎవరుంటారు?*
    చంద్రబాబు కంటే ఐరన్‌ లెగ్‌ తెలుగుదేశం పార్టీకి ఎవరుంటారు? రాష్ట్రానికి ఎవరుంటారు? తన కొడుకు ఐరన్‌ లెగ్‌–2 అని గమనించిన తరవాతే కదా పుత్రుడిమీద కంటే దత్త పుత్రుడి మీద నమ్మకాలు ఎక్కువ పెట్టుకున్నాడు! తన మీద తనకు నమ్మకం లేకే కదా... పవన్‌ కల్యాణ్‌కు మళ్ళీ కన్ను కొడుతున్నాడు? 

- ఐరన్‌ లెగ్‌ అంటే ఎవరిది? ఏరువాక అని చెప్పి సీఎంగా పాలకొల్లులో ఏ పొలంలో అడుగు పెట్టాడో ఆ పొలం ఎండిపోయింది. అలాగే, రెయిన్‌ గన్‌ అని అనంతపురంలో అడుగు పెట్టిన పొలం పూర్తిగా బీడు అయిపోయింది. 102 సీట్లతో 2014లో ఉన్న పార్టీకి 2019లో 23 సీట్లు మిగిలాయంటే... కొడుకు, దత్తపుత్రుడు కూడా తన పాలన దెబ్బకు ఎన్నికల్లో గోవింద కొట్టారంటే... ఎవరిది ఐరన్‌ లెగ్‌? తన పాలనలో ఏనాడూ వర్షాలు కురవలేదంటే ఎవరిది ఐరన్‌ లెగ్‌? 

- ఈ మనిషి 44 ఏళ్ళ రాజకీయంలో సీఎం పదవి పక్కాగా వచ్చిందా? లేక పక్క నుంచి వచ్చిందా అన్నది అందరికీ బాగా తెలుసు! బాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి... తన పేరు చెపితే ఒక్కటంటే ఒక్క మంచి పథకం అమలు చేయలేని ఈ దౌర్భాగ్యుడు... ఈ రోజు మరోసారి పదవి అడుగుతాడా? జనం అంపశయ్యమీద కూర్చోబెట్టి, 2019 తరవాత కూడా ప్రతి ఎన్నికల్లో బాదుడే బాదుడు అని బాదేసినా... ఈ ముసలాయనకు బుద్ధీ జ్ఞానం లేకుండా రోజూ తన మందతో ఏది పడితే అది తిట్టిస్తాడు. తానూ మాట్లాడతాడు. 

చివరిగా, బాబుకు ఒకటే చెపుతున్నాం... విశాఖను, ఉత్తరాంధ్రను దెబ్బతీసి... అమరావతిలో బినామీ భూముల రేట్ల కోసం చేసే కుట్రలకు, కుతంత్రాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

Back to Top