చంద్రబాబు వల్ల ఇదేం ఖర్మరా బాబూ

ఎందుకంత దిగజారావు?

నా పాలన ఇదీ అని చెప్పుకోలేకపోతున్నావు

చివరి ఎన్నికలు.. ఛాన్స్‌ ఇవ్వమని అడుగుతున్నావు!

మంత్రి అంబటి రాంబాబు చురక

నీ మాటలు, నీ వ్యవహారం నీ ఖర్మకు నిదర్శనం

తెలుగుదేశం పార్టీకి, రాష్ట్రానికి చంద్రబాబు ఒక ఖర్మ

ఈ మాటే ఆ పార్టీ వారంతా అనుకుంటున్నారు

మంత్రి శ్రీ అంబటి రాంబాబు వెల్లడి

నేను నోరు తెరిస్తే ఉరేసుకుని చస్తావు

గంట, అరగంట మంత్రి అంటావా?

కంట్రోల్‌ యువర్‌ టంగ్‌. మర్యాదగా మాట్లాడు

ఏం తమాషాగా ఉందా? జాగ్రత్త

మళ్లా నోరు జారిందా.. ఉరేసుకుని చచ్చే విషయాలు బయట పెడతా

చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు వార్నింగ్‌ 

ఇకనైనా సంస్కారం నేర్చుకో

ఎందుకు నీకంత ఫ్రస్టేషన్‌? ఏమిటా ఫ్రస్టేషన్‌?

రాజకీయాల్లో చివరి అంకంలో ఈ రకమైన ఖర్మ ఎందుకు? 

ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకో. వాస్తవాలు మాట్లాడు

ఇప్పటికైనా సంస్కారవంతంగా మాట్లాడు

ప్రెస్‌మీట్‌లో మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ

తాడేపల్లి: చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు చాలా పథకాలు, నిర్మాణాలు ప్రారంభించే అవకాశం ఉంది. కానీ ఇవాళ ఆయన ఏలూరులో ఇదేం ఖర్మ? అని కార్యక్రమం చేపట్టారు. నిజానికి చంద్రబాబు పర్యటన, ఆయన మాటలు చూస్తుంటే.. ఇదేమీ ఖర్మ తెలుగుదేశం పార్టీకి?.. ఇదేమి ఖర్మ రాష్ట్రానికి?. అన్నది చక్కగా అన్వయింపుగా ఉంటుంద‌ని మంత్రి అంబ‌టి రాంబాబు ఎద్దేవా చేశారు. ఎందుకంటే,  దెందులూరు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు, తాను గతంలో జిల్లాలో ఎన్నోసార్లు పర్యటించినా ఈ స్థాయిలో ప్రజలు రాలేదని సొంతంగా డబ్బా కొట్టుకుంటున్నారు. అంటే ప్రజలు రావడం లేదన్న విషయాన్ని ఆయనంతట ఆయనే చెప్పుకుంటున్నారు.
    ఇంతకు ముందు ఆయన బాదుడే బాదుడు అన్న కార్యక్రమం చేశారు. కానీ ప్రజలు ఆయన పాలనలో చేసిన బాదుడును ప్రజలు మర్చిపోలేదు. అందుకే ఆ కార్యక్రమం పూర్తిగా ఫెయిల్‌ అయింది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ తమ పార్టీ ఓడిపోయిందని, అందుకే ప్రజలు ఇప్పటికీ చంద్రబాబును నమ్మడం లేదని, స్వయంగా ఆ పార్టీ వారే అనుకుంటున్నారు.

నీచమైన ఆలోచన–విష ప్రయత్నం:
    ఏ దిక్కు తోచని చంద్రబాబు పదే పదే వైయస్‌ వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావిస్తున్నారు. ఆ హత్య జరిగినప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే ఉంది. ఇప్పుడు ఆ కేసు విచారణ జరుగుతోంది. కానీ చంద్రబాబు మాత్రం, సీఎం శ్రీ వైయస్‌ జగన్, స్వయంగా తన బాబాయిని హత్య చేశారని మాట్లాడుతున్నారు. నిజానికి వారి కుటుంబంలో జరిగిన బాధకరమైన ఘటన, హత్యను గందరగోళం చేసి, రాజకీయం చేసి, దాంతో లాభం పొందాలన్న నీచమైన ఆలోచన చంద్రబాబు చేస్తున్నారు. లేనిపోని అనుమానాలు సృష్టించి, రాజకీయంగా లబ్ధి పొందాలన్న విష ప్రయత్నం చేస్తున్నారు.

అక్కడే ఎందుకు ఉంటున్నావు?:
    ఇంకా పదే పదే అవే విషయాలు చెబుతున్నారు. ఐటీ తానే తెచ్చానని, హైదరాబాద్‌ను తానే కట్టానని చెప్పుకుంటున్నాడు. చివరకు సెల్‌ఫోన్‌ కూడా తానే కనిపెట్టానని అంటున్నాడు. మరి హైదరాబాద్‌లోనే ఉంటావా? రాష్ట్రాన్ని 5 ఏళ్లు పాలించావు. నీకు ఇక్కడ కనీసం సొంత ఇల్లు లేదు. హైదరాబాద్‌లో ఉంటాడు. అప్పుడప్పుడు వచ్చి రాజకీయాలు చేస్తున్నాడు.  ఇంతకన్నా చంద్రబాబుకు ఇంకేం ఖర్మ కావాలి?. అందుకే ఇది తెలుగుదేశం పార్టీ ఖర్మ. ఆ పార్టీ కార్యకర్తల ఖర్మ.

కమిషన్ల కోసమే కదా?:
    పోలవరం గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. మళ్లీ చెబతున్నాను. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కాఫర్‌ డ్యామ్‌ లేకుండా, డయాఫ్రమ్‌ వాల్‌ కట్టిన దౌర్భాగ్యకరమైన తెలివి ఉన్న చంద్రబాబు, తాను హైదరాబాద్‌ కట్టానని చెప్పుకుంటున్నాడు. అసలు పోలవరం ప్రాజెక్టును కడతామని కేంద్రం చెబితే.. ఆ బాధ్యత ఎందుకు తీసుకున్నారు? కేవలం కమిషన్ల కోసమే కదా?

వారినే మోసం చేశావు కదా?:
    డ్వాక్రా గ్రూప్‌లు ఏర్పాటు చేసింది తానే అని, స్వయంగా ప్రధానిగారు అన్నారని చంద్రబాబు చెబుతున్నారు. మరి అదే ప్రధానిగారు.. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారని కూడా అన్నారు. మరి ఆ విషయం చెప్పడం లేదు ఎందుకు?.
    డ్వాక్రా గ్రూప్‌లు ఏర్పాటు చేశానంటున్న చంద్రబాబు, మరి ఆ మహిళలనే మోసం చేశారు కదా? రుణ మాఫీ చేస్తానని వారిని దగా చేశారు. అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పారు. మోసాలు చేసిన చంద్రబాబుకు చుక్కలు చూపారు.
    కానీ సీఎం శ్రీ వైయస్‌ జగన్, వారిని ఆదుకున్నారు. వారి రుణాలు విడతల వారీగా చెల్లిస్తున్నారు. అయినా దుర్మార్గంగా మాట్లాడుతున్న చంద్రబాబు, ఏదో ఒక విధంగా తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఏం కర్మ అయ్యా చంద్రబాబు? తనకు ఇవే చివరి ఎన్నికలు అంటున్నాడు. ఒక్కసారి ఛాన్స్‌ ఇవ్వమంటూ దిగజారి పోయాడు. నిజంగా చంద్రబాబుకు ఖర్మే..

అదీ నీ ఖర్మ..:
    గతంలో డ్వాక్రా మహిళల రుణాలు, రైతుల రుణాలు మాఫీ చేస్తానన్నావు. అధికారంలోకి వచ్చాక, వారి కొంప ముంచావు. మళ్లీ ఇప్పుడు మాయమాటలు చెప్పి, తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నావు. ఇదీ నీ ఖర్మ చంద్రబాబు. 

నీ చరిత్ర మొత్తం తెలుసు:
    ఇంకా నా మీద కూడా పిచ్చి విమర్శలు. పోలవరం ప్రాజెక్టు గురించి నాకు తెలియదు అంటున్నాడు. పోగేసిన అంత మంది జనంలో నన్ను  గంట, అర గంట మంత్రి అంటున్నాడు. నీకసలు సంస్కారం ఉందా? నీ గురించి నాకు బాగా తెలుసు. 
    1975లో యూత్‌ కాంగ్రెస్‌ లీడర్‌గా, సంజయ్‌గాంధీ దగ్గర చేరి, ఎన్ని బ్రోకర్‌ పనులు చేశావో నాకు తెలుసు. ఆ తర్వాత అంజయ్యగారి మంత్రివర్గంలో ఏమేం చేశావో నాకు తెలుసు. ఆ తర్వాత వైయస్సార్‌గారి దగ్గర చిల్లర చిల్లరగా ఎంతెంత డబ్బు తీసుకున్నావో నాకు తెలుసు. చివరకు ఆయన బ్యాగ్‌లు, సూట్‌కేసులు కూడా మోశావు.  ఎందుకంటే వైయస్సార్‌గారు ముందు నుంచే శ్రీమంతులు. అలాంటి నీవు నా గురించి మాట్లాడుతున్నావు.

నేను నోరు తెరిస్తే..:
    నీ గురించి మొత్తం తెలుసు. నీ పెళ్లి సంగతి తెలుసు. నీ కుటుంబం గురించి తెలుసు. నీ తమ్ముడు రామ్మూర్తినాయుడు గురించి తెలుసు. నీ భార్య గురించి తెలుసు. నీ కొడుకు గురించి తెలుసు. ఒక్క నిమిషం నా సంస్కారాన్ని పక్కన పెట్టి నేను కూడా మాట్లాడితే.. ఉరేసుకుని ఛస్తావు. 
అంత మంది జనంలో గంట, అరగంట మంత్రి అంటావా. కంట్రోల్‌ యువర్‌ టంగ్‌. మర్యాదగా మాట్లాడు. తమాషాగా ఉందా? జాగ్రత్త. మళ్లా నోరు జారిందా.. ఉరేసుకుని చచ్చే విషయాలు నేను బయట పెడతాను. సంస్కారం నేర్చుకో.
    ఎందుకు నీకంత ఫ్రస్టేషన్‌? ఏమిటా ఫ్రస్టేషన్‌? నీ రాజకీయ జీవిత చివరి అంకంలో ఈ రకమైన ఖర్మ నీకెందుకు? ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకో. వాస్తవాలు మాట్లాడు. ఇప్పటికైనా సంస్కారవంతంగా మాట్లాడు. ప్రజలను మోసం చేయకు.

నీ జీవితమంతా..:
    నీ జీవితమంతా మోసం చేయడమే. నీ తమ్ముడిని మోసం చేశావు. నీ బావమరుదులను మోసం చేశావు. చివరకు నీ కొడుకును కూడా మోసం చేస్తావు. నీకు అధికార కాంక్ష తప్ప మరేం లేదు. నీ మామను కూడా మోసం చేశావు.

నీకు నవ్వు రాదు. నీవొక రాయివి:
    జగన్‌గారి నవ్వు చూసి ఎందుకు అంత ఏడుస్తున్నావు? గతంలో వైయస్సార్‌గారు అసెంబ్లీలోనే స్పష్టంగా చెప్పారు. నవ్వడం భోగం అని. ఆయన అలాగే నవ్వేవారు. ఇప్పుడు ఆయన కొడుకు జగన్‌గారు కూడా అలాగే నవ్వుతుంటారు. ఎందుకంటే వారికి మనసు, ప్రేమ, అభిమానం ఎక్కువ. వారు కష్టపడి పైకి వచ్చారు.
    కానీ అవేవీ నీకు లేవు. నీ జీవితమంతా కుట్రలు. కుతంత్రాలు, నీ బుర్ర నిండా అవే ఆలోచనలు. అందుకే నీకు నవ్వు రాదు. నీవు ఒక రాయి లాంటి వాడివి. డబ్బు, డబ్బు, డబ్బు. పవర్, పవర్, పవర్‌. అదే నీ ఆలోచన. చంద్రబాబు నీ జీవితమంతా ఒక ఖర్మ.

నీవెన్ని ప్రయత్నాలు చేసినా..:
    జగన్‌గారిపై ఊర్కే నోరు పారేసుకుంటే, ప్రజలు ఆదరిస్తారనుకుంటే నీ ఖర్మ. రాష్ట్రంలో నీవు తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యం. ఎన్ని కార్యక్రమాలు చేసినా, బాదుడే బాదుడు అంటూ తిరిగినా..ఎన్ని ఖర్మలు ప్రారంభించినా.. నీ పార్టీకి ప్రజలు ఖర్మ చేయడం ఖాయం. దీన్ని గుర్తు పెట్టుకోవాలి.

 మాకేం అవసరం?:

    ఏదో విధంగా సానుభూతి పొందాలన్నది చంద్రబాబు ప్రయత్నం. చంద్రబాబును, ఆయన కొడుకును చంపుతామా? మాకేం అవసరం? మాకేం పని? రాజకీయంగా నీవు ఏమున్నావు అని?
    చంద్రబాబుది జగన్‌గారిని అప్రతిష్టపాల్జేసే ప్రయత్నం. ఆయనపై బురద చల్లడం కోసం.. నీవు, దుష్ట చతుష్టయం.. నీ అనుకూల మీడియా, నీ దత్తపుత్రుడు విశ్వప్రయత్నం చేస్తున్నారు. దుష్ప్రచారం చేస్తున్నారు. 

ప్రజలు మిమ్మల్ని నమ్మబోరు:
    జగన్‌గారు చిత్తశుద్ధితో పరిపాలిస్తున్నారు. ఈ మూడున్నర ఏళ్లు అలాగే చేశారు. ఇంకా ఏడాదిన్నర కూడా చేస్తారు. మీరు ప్రచారం చేసుకొండి. మీరేం చేసినా ప్రజలు నమ్మరు. నమ్మబోరు. ఇది వాస్తవం.
నిజానికి చంద్రబాబు పెట్టుకున్న ఇదేం ఖర్మ? ఆ కార్యక్రమం సరికాదని, బాగా లేదని స్వయంగా ఆ పార్టీ వారే చెబుతున్నారు. అందుకే ప్రజలను ఆ పేరు బాగుందా? అని చంద్రబాబు అడుగుతున్నారు. అంటే తనపై తనకు నమ్మకం పోవడంతో, చంద్రబాబు ఆ విధంగా మాట్లాడుతున్నారు.     అధికారంలోకి వస్తే, డబుల్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటున్న చంద్రబాబు, గత 5 ఏళ్ల పాలనలో ఏ పథకాలు అమలు చేశాడో.. అందరికీ గుర్తు ఉంది. 

దుష్టచతుష్టయంలోనే కోపం:
    ఇంకా ప్రజలకు కోపం రావడం లేదని కూడా చంద్రబాబు అంటున్నారు. చక్కటి పాలనలో ఉన్న ప్రజలకు కోసం ఎందుకు వస్తుంది? కేవలం చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు, పవన్‌కళ్యాణ్‌కు మాత్రమే కోపం వస్తోంది. ఎందుకంటే వారి దోపిడి ఆగిపోయిందని.
    ప్రజలకు అస్సలు కోపం రాదు. ఎందుకంటే నీతి, నిజాయితీగా పాలన సాగుతోంది. ప్రజలకు అన్నీ అందుతున్నాయి. రాష్ట్రం సుబిక్షంగా ఉంది. అందుకే జనం సీఎంగారిపైన, ప్రభుత్వంపైన ప్రేమతో ఉన్నారు.
అది చూసే చంద్రబాబుకు బుర్ర పోతోంది. అందుకే ప్రజలు తిరగబడాలని పిలుపునిస్తున్నారు అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Back to Top