కన్నా..కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా?

చంద్రబాబుకు అమ్ముడుపోలేదని ప్రమాణం చేస్తావా?

కాంగ్రెస్‌లో ఉంటూ సీఎం పదవి కోసం ఓ నేతకు రూ.20 కోట్లు ఇవ్వలేదా?  

2019 ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం ఇచ్చిన ఫండ్‌ కాజేయలేదా?

కన్నా, సుజన ఇద్దరూ టీడీపీ కోవర్టులు

కేంద్రం కంటే తక్కువకే ఏపీ ప్రభుత్వం రాపిడ్‌ కిట్లు కొనుగోలు చేసింది

నిత్యం చంద్రబాబు స్ఫూర్తి ముక్తావళి చెబుతున్నారు..

కరోనా కట్టడికి సీఎం వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో పని చేస్తున్నారు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

తాడేపల్లి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు జేబు మనిషి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబుకు అమ్ముడపోలేదని కన్నా కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాలు విసిరారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. మేం అడిగే ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పి ..ఆ తరువాత కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధం కావాలని సూచించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

కేంద్రం కంటే తక్కువ ధరకే రాపిడ్‌ కిట్లు కొన్నాం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజు రోజుకు ఉధృతమవుతుందని, దేశంలోనూ, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. కరోనా కట్టడికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలకు తగదన్నారు. దక్షిణ  దక్షిణ కొరియా  దేశం నుంచి రాష్ట్ర ప్రభుత్వం లక్ష రాపిడ్‌ కిట్లు కొనుగోలు చేసిందని, వీటిని అన్ని జిల్లాలకు పంపిణీ చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దేశం నుంచి కిట్లు కొనుగోలు చేస్తుందన్నారు. కేంద్రం కొన్న ధర కంటే ఏపీ ప్రభుత్వం తక్కువ ధరకే కొనుగోలు చేసిందన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా రూ.790 చొప్పున కిట్లు కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దేశంతో కిట్లు కొనుగోలు చేసే సమయంలో ఒక షరత్తు కూడా పెట్టిందని, ఎవరికైనా మాకంటే తక్కువకు అమ్మితే..అదే ధరకు మాకు కూడా ఇవ్వాలని కండిషన్‌ పెట్టినట్లు చెప్పారు. ఈవిషయంలో ఏపీ ప్రభుత్వాన్ని, వైయస్‌ జగన్‌ ముందు చూపును అభినందించాల్సింది పోయి చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణలు కిట్ల కొనుగోలులో అవినీతి జరిగిందని అబద్ధాలు చెబుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. 

కన్నా..బీజేపీ అధ్యక్షుడివి ఎలా అయ్యావు..
కన్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా పుట్టి పెరిగింది కాంగ్రెస్‌ పార్టీలోనే అని అంబటి రాంబాబు తెలిపారు.కాంగ్రెస్‌లో మంత్రి స్థాయికి ఎదిగిన కన్నా ..దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత రోశయ్య సీఎం అయ్యారని, ఆ తరువాత కిరణ్‌ కుమార్‌ రెడ్డిని సీఎం చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతుండగా కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌ పెద్దల్లో ఒకరికి సీఎం పదవి కోసం రూ.20 కోట్లు ముట్టచెప్పారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. బీజేపీలో ఉంటూ 2018 ఏప్రిల్‌ 20న అధ్యక్ష పదవి ఇవ్వలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారన్నారు. ఏప్రిల్‌ 24న రాని గుండెపోటు వచ్చినట్లు వచ్చినట్లు గుంటూరు ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు. బీజేపీలో ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తులు ఉన్నారని, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్న వారిని కాదని కన్నాకే అ«ధ్యక్ష పదవి ఎలా ఇచ్చారో అందరికి తెలుసు అన్నారు. చంద్రబాబుకు కన్నా లక్ష్మీనారాయణ అమ్ముడపోయారని విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నామన్నారు. కన్నా, సుజనా చౌదరి..ఈ ఇద్దరూ కూడా బీజేపీలో పచ్చ ఛీడలన్నారు. వీరు చంద్రబాబుకు కోవర్టులని, జేబులో మనుషులని చెప్పారు. చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబు నిత్యం స్కైప్‌ టీవీలో సూక్తులు చెబుతుంటారని, ఇక అఖిలపక్షం ఎందుకని ప్రశ్నించారు. సత్తెనపల్లిలో పోలీసులు కొట్టడం వల్లే యువకుడు చనిపోలేదని, 25 ఏళ్ల ఆ యువకుడికి పదేళ్ల క్రితమే హార్ట్‌ సర్జరీ జరిగిందని, పోలీసులు ఒక్క దెబ్బ కొట్టే సరికి భయంతో చనిపోయారన్నారు. చనిపోయిన యువకుడిది పేద కుటుంబమని, ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని అంబటి రాంబాబు తెలిపారు.

కన్నా..ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పు..
కన్నా లక్ష్మీ నారాయణకు అంబటి రాంబాబు ఐదు ప్రశ్నలు సంధించారు. వీటిని సమాధానం చెప్పి కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధం కావాలని చాలెంజŒ  విసిరారు. 
1.  ఏప్రిల్‌ 24న, 2018న నిజంగా గుండెపోటు వచ్చిందా?
2. కాంగ్రెస్‌లో ఉంటూ సీఎం పదవి కోసం ఓ నేతకు రూ.20 కోట్లు ఇవ్వలేదా?
3. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం ఎన్నికల ఫండ్‌ ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసింది వాస్తవం కాదా?
4. చిన్న స్థాయి నుంచి వందల కోట్లు ఎలా సంపాదించావు
5. చంద్రబాబుకు అమ్ముడపోలేదని కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణం చేస్తారా?

 

తాజా వీడియోలు

Back to Top