క‌రోనా ప‌రీక్షల్లో ఏపీ నంబర్‌ వన్‌  

 వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు  
 

  తాడేప‌ల్లి : కోవిడ్ ప‌రీక్షల్లో  దేశంలోనే మొద‌టి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌   రాష్ర్టం కొన‌సాగుతుంద‌ని  వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు అన్నారు.  తాడేప‌ల్లిలో నిర్వహించిన మీడియా స‌మ‌వేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ప్రతి మిలియ‌న్‌కు 1,147 మందికి ప‌రీక్షలు రాష్ట్రంలో చేస్తున్నామ‌ని తెలిపారు. ఇప్పటివ‌ర‌కు రాష్ర్టంలో 54,  341 మందికి క‌రోనా పరీక్షలు నిర్వహించామని, వారిలో 1016 మందికి పాజిటివ్ అని తేలింద‌ని అన్నారు. 

బాబు ఒక మంచి సలహా కూడా ఇవ్వలేదు
క‌రోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చ‌ర్యలు తీసుకుంటుంద‌ని   అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు క‌రోనా క‌ట్టడికి  ఒక్క మంచి స‌ల‌హా కూడా ఇవ్వలేదన్నారు. స‌ల‌హాల పేరుతో క‌రోనాను కూడా ప్రతిపక్ష నేత రాజ‌కీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వంపై విమ‌ర్శల పేరుతో రాజ‌కీయం చేయాల‌నే దుర్భుద్ది త‌ప్పా చంద్రబాబుకు మ‌రొక‌టి లేద‌ని మండిప‌డ్డారు. దీనికి ఆయ‌న తాబేదారులు భ‌జ‌న చేస్తున్నారని అన్నారు. 

అందరినీ సమన్వయం చేసుకుంటూ..
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అంద‌రినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నార‌ని అంబటి తెలిపారు. క‌రోనాను అరిక‌ట్టే యంత్రాంగంపై ప్రతిపక్షం రాళ్లు వేస్తుంద‌ని దుయ్యబట్టారు. ఢిల్లీ, తెలంగాణ‌లో ఒక‌రకంగా, ఆంధ్రప్రదేశ్‌లో మ‌రోర‌కంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  బాబుకు భ‌జ‌న చెయొద్దని కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు బీజేపీ అధిష్టానం మొట్టికాయ‌లేసింద‌ని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. 

Back to Top