బీసీ గర్జనకు సర్వం సిద్ధం 

  • రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్న బీసీ వర్గాలు
  • ఆర్ధిక, సామాజిక, విద్యా పరమైన పురోభివృద్ధే లక్ష్యం
  • బీసీలకు సువర్ణ యుగ సాధన దిశలో  డిక్లరేషన్ 

హైదరాబాద్: బలహీన వర్గాల పురోభివృద్ధి కోసం బీసీ డిక్లరేషన్ ప్రకటనే ధ్యేయంగా ఆదివారం మధ్యాహ్నం ఏలూరులో  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ గర్జన నిర్వహణకు సర్వం సిద్ధమైంది. 14 నెలల పాటు చేసిన సుదీర్ఘ పాదయాత్రలో  వివిధ వర్గాల కష్ట నష్టాలను దగ్గర నుంచి చూసిన అనుభవం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీ సమస్యలను అధ్యయనం చేసిన బీసీ అధ్యయన కమిటీ నివేదికల ఆధారంగా వైయస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. 
ఈ గర్జన సదస్సులో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ వర్గాలకు చెందిన అనేక మంది తరలి వస్తున్నారు. ప్రస్తుతం బీసీలుగా ఉన్న దాదాపు 130 కులాలకు ప్రయోజనాలు చేకూరి, బీసీలకు సువర్ణయుగం తెచ్చేలా ఈ డిక్లరేషన్ ఉంటుందని పార్టీలు నాయకులు చెపుతున్నారు. పాదయాత్ర ముగిసిన తరువాత బీసీ గర్జన సభలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటిస్తామని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చాలాకాలం క్రితమే ప్రకటించారు. చేసిన ప్రకటనకు అనుగుణంగా నేటి మధ్యాహ్నం గర్జన సభ నిర్వహిస్తున్నారు. 
అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల వారికి ముఖ్యంంగా వెనకబడిన వర్గాల్లో చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారు, తమ వత్తులను  భారంగా కాకుండా లాభసాటిగాను, రాష్ట్ర అభివృద్ధిలోకీలకమైనవిగాను నిర్వహించుకునేందుకు వీలుగా ప్రభుత్వ పరంగా తోడ్పాడు అనేది తప్పనిసరి. దురదృష్టవశాత్తూ, ప్రస్తుత పాలకులు వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారిని కేవలం ఓటుబ్యాంకుగానే పరిగణిస్తూ వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. ఎన్నికలకు కొన్ని నెలలముందు కంటితుడుపుగా ఏవో పథకాలను ప్రకటించి, వాటిని కూడా అర్హులైన అందరికీ కాకుండా, తస్మదీయులకే వర్తింప చేస్తూ, వాటిలో కూడా అవినీతికి పాల్పడుతూ జేబులు నింపుకోవడమే లక్షంగా పనిచేస్తున్నారు తప్ప, నిజమైన సంక్షేమం పురోభివృద్ధి, తోడ్పాటును అందించడంలేదన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. 
ఈపరిస్థితుల నేపథ్యంలో కాగితాల కోసం కాకుండా, రాజకీయాలకు అతీతంగా వారి వాస్తవ పురోభివృద్ధే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ ఉండనున్నదని వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చెపుతున్నారు. బీసీ వర్గాలకు ఏవిధంగా మేలు జరగనుందో బీసీ గర్జన లో వెల్లడి కానుంది.

Back to Top