దివంగ‌త మంత్రి గౌత‌మ్‌రెడ్డి శాఖ‌లు ఇత‌ర మంత్రుల‌కు కేటాయింపు

తాడేప‌ల్లి: అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతర మంత్రులుకు కేటాయించారు. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్‌ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్‌, ఎన్ఆర్ఐ ఎంపవర్‌మెంట్ కేటాయించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల వ్యవహారాలను సదరు మంత్రులు చూడనున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top