23 కేసుల్లో స్టే తెచ్చుకున్న వ్యక్తిగా చంద్రబాబు

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  
 

అమరావతి: 23 కేసుల్లో స్టే తెచ్చుకున్న వ్యక్తిగా చంద్రబాబు అని  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. సోనియా, చంద్రబాబు కుమ్మక్కై వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. అయితే 23 కేసుల్లో స్టే తెచ్చుకున్న వ్యక్తిగా చంద్రబాబును పేర్కొన్నారు. ప్రజలు 151 స్థానాలు ఇచ్చి వైఎస్‌ జగన్‌కు పట్టం కట్టారని తెలిపారు. 

సభ్యుల ప్రవర్తన గురించి రూల్స్‌బుక్‌లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల్లాగా తామెప్పుడూ ప్రవర్తించలేదన్నారు. పోడియం వద్దకు వచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారో టీడీపీ సభ్యులకే అర్థం కావటం లేదని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు తీర్మానం చేస్తే తాము బలపరిచిన విషయాన్ని గుర్తు చేశారు.

 గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతకు ఎంత సమయం ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ కన్నీళ్లు పెట్టుకున్నా మైక్‌ ఇవ్వలేదని విమర్శించారు. కానీ నేడు ప్రతిపక్ష నేతలకు ఎంత అవకాశం కల్పిస్తున్నారో గమనించాలని ఆర్కే సూచించారు.

Back to Top