మంగళగిరిలో లోకేష్‌ ఓటమి ఖాయం

ఏం అభివృద్ధి చేశారని ఓట్లు అడుగుతారు

చంద్రబాబు,లోకేష్‌లకు ప్రజలు బుద్ధి చెబుతారు

వైయస్‌ఆర్‌సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి

అమరావతి:మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోవడం ఖాయమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల  రామకృష్ణారెడ్డి అన్నారు.మంగళగిరిలో ఏం అభివృద్ధి చేశారో చంద్రబాబు,లోకేష్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.నాలుగేళ్లుగా రాజధాని ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏ మొహం పెట్టుకుని మంగళగిరి ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.  మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో మున్సిపల్‌ వార్డు కూడా గెలుచుకోలేపోయారని ఎద్దేవా చేశారు.చంద్రబాబు,లోకేష్‌కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

 

Back to Top