అభివృద్ధి ప‌నుల‌కు ఆమోదం తెలిపిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ధ‌న్య‌వాదాలు

మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి

గుంటూరు:  మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆమోదం తెల‌ప‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బకింగ్‌ హామ్‌ కెనాల్‌ రోడ్‌ను రూ. 200 కోట్లతో నాలుగు లైన్లుగా మార్చడానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆమోదించారని  తెలిపారు. తెనాలి నుంచి మంగళగిరి నేషనల్ హైవే రోడ్డు వరకు నిర్మించబోయే రోడ్డుకు త్వరలో టెండర్లు ప్రారంభమవుతాయని చెప్పారు. దుగ్గిరాల మండలంలో 18 గ్రామాల్లో రూ.70 నుంచి రూ. 80 కోట్లతో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. దుగ్గిరాల మండలాన్ని రూ. 400 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపిన సీఎం వైయ‌స్ జగన్‌కు  ఎమ్మెల్యే ఆర్కే ధన్యవాదాలు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top