త్వ‌ర‌లోనే డాక్టర్‌ ధనలక్ష్మి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌

వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

  విజయవాడ: తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒంగోలు రిమ్స్ డెంటల్‌ డాక్టర్‌ ధనలక్ష్మి త్వ‌ర‌లోనే సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ధ‌న‌ల‌క్ష్మీ  ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మద్రాస్‌ అపోలో ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు.  

కొద్దిరోజుల్లోనే డాక్టర్‌ ధనలక్ష్మి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యే  అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. ఆమె ఆరోగ్య పర్యవేక్షణకు ఒంగోలు నుండి ప్రత్యేకంగా మత్తు వైద్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్‌ను అందుబాటులో ఉంచారు.  

స్పెషల్ కేసుగా తీసుకొని డాక్టర్ ధనలక్ష్మికి అత్యవసర వైద్యం అందించి ప్రాణాపాయం నుండి కాపాడడానికి అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం భట్ల గూడూరు గ్రామానికి చెందిన డాక్టర్ ధనలక్ష్మి.. కోవిడ్ సమయంలో ఆరు నెలలు కాలానికి వైద్య సేవలు అందించడానికి తాత్కాలిక పద్ధతిలో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ డెంటల్ డాక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలను ఆమె నిర్వహిస్తున్నారు.

Back to Top