అగ్ని ప్రమాదం అత్యంత బాధాకరం

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
 

 కృష్ణా: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారికీ సంతాపం వ్యక్తంచేశారు. వారికుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసి సహాయకచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసదుపాయం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.  ఈ ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వపరాలకు సంబంధించిన నివేదిక సమర్పించాలని రాష్ట్ర సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందని చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చేందినవారి కుటుంబాలకు సీఎం వైయ‌స్‌ జగన్‌ రూ. 50లక్షలు పరిహారం ప్రకటించారని పేర్కొన్నారు.

స‌హాయ‌క చ‌ర్య‌లు వేగ‌వంతం చేయండి:  పెద్దిరెడ్డి
విజయవాడ ప్రమాద ఘటనపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తో ఫోన్లో మాట్లాడారు. బాధితులను ఆదుకునే సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యసహాయం అందించాలని సూచించారు. విజయవాడ నగరంలో ప్రైవేట్ హోటళ్లలో నిర్వహిస్తున్న కోవిడ్ చికిత్స కేంద్రాల్లో అన్ని రక్షణ సదుపాయాలు వుండేలా తనిఖీలు మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం:  ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు
విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు, ప్రమాద కారణాలు గురుంచి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా బాధితులను ఆదుకుంటుందని తెలిపారు. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తాజా వీడియోలు

Back to Top