తాడేపల్లి: ఈ నెలరోజుల్లో ఏపీలో జరిగిన హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలు వీటన్నింటిపైనా పార్లమెంట్‌లో లేవనెత్తాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలకు సూచించారు. తాడేపల్లిలోని వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎంపీలతో వైయస్ జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఆ వివరాలను ఎంపీ అయోధ్య రామిరెడ్డి మీడియాకు తెలిపారు. ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి ఏమన్నారంటే.. ఈ రోజు మా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ నాయకత్వంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మా పార్టీ క్యాడర్‌పై చేస్తున్న భౌతిక దాడులు, ప్రజల్లో నెలకొన్న భయాందోళలపై ఏ విధంగా ప్రభుత్వానికి తెలియజెప్పాలా అనేది, ఆ పద్దతులు ఎలా ఆపాలా అనేది, కేంద్రం దృష్టికి తీసుకురావడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించాం ఈ నెలరోజుల్లో ఏపీలో జరిగిన హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలు వీటన్నింటిపైనా పార్లమెంట్‌లో లేవనెత్తాలని మా అధ్యక్షుడు చెప్పారు, వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావం నుంచి తీసుకున్న నిర్ణయాలను డిస్టబ్ చేయాలనుకున్నా అది జరిగే పనికాదు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఆపాలని మేం డిమాండ్ చేస్తున్నాం, మా పార్టీ ఎంపీలు, నేతలపై చేస్తున్న దాడులను వెంటనే ఆపాలి, చంద్రబాబుకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అడ్డుకట్ట వేయకపోతే ఇంకా దారుణాలు జరుగుతాయి, అసెంబ్లీ సమావేశాలలో కూడా మేం నిరసన తెలియజేస్తాం, ఢిల్లీలో బుధవారం దేశ ప్రజలందరికీ తెలియజేసేలా ఏపీలో జరుగుతున్న అకృత్యాలను ఆపాలన్న బాధ్యత తెలియజేస్తాం, అంతేకాక ఇక్కడ జరిగిన పరిణామాలను ఒక ఫోటో గ్యాలరీ, వీడియోల ద్వారా దేశ ప్రజలందరికీ తెలియజెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాం, దీనిపై ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడిగాం, ఢిల్లీలో జరగనున్న ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వనించాలని నిర్ణయించుకున్నాం. ఇది ఒక రాజకీయ పార్టీపై జరుగుతున్న దాడి కాదు, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి, ఈ ఘటనలను లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ పెద్ద ఎత్తున తీసుకొచ్చి కేంద్రం దృష్టికి తీసుకెళతాం, దేశం మొత్తానికి తెలియజేసేలా మా నిరసన కార్యక్రమం ఉంటుందని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మీడియాకు వివరించారు.