ఆల్‌ ద వెరీ బెస్ట్‌

సీఎం వైయ‌స్ జగన్‌ను కలిసిన 2021 బ్యాచ్‌ ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను  2021 బ్యాచ్‌ ఐఏఎస్‌ ప్రొబేషనర్స్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. 2021 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన తొమ్మిది మంది ప్రొబేషనరీ అధికారులు పాలనాపరమైన అవగాహన పెంపొందించుకునేందుకు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిసి వారి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్‌తో సమావేశమయ్యారు.

 ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని మార్గనిర్ధేశం చేసి ఆల్‌ ద వెరీ బెస్ట్‌ చెప్పిన సీఎం 

 ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌ పి. ధాత్రిరెడ్డి, వై.మేఘ స్వరూప్, ప్రఖర్‌‡ జైన్, గొబ్బిళ్ళ విద్యాధరి, శివ నారాయణ్‌ శర్మ, అశుతోష్‌ శ్రీవాత్సవ, అపూర్వ భరత్, రాహుల్‌ మీనా, సూరపాటి ప్రశాంత్‌ కుమార్‌. 

తాజా వీడియోలు

Back to Top